Home తెలంగాణ గిరి దర్శక్ పర్యాటక గైడ్‌లకు శిక్షణ

గిరి దర్శక్ పర్యాటక గైడ్‌లకు శిక్షణ

32
0
  • మొబైల్ మ్యూజియం ప్రారంభించిన ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్

ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మే15:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ పర్యాటక శాఖ పర్యాటక రంగం మరింత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగానే ములుగు జిల్లాలో గిరి దర్శక్ పర్యాటక గైడ్ లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.శుక్రవారం జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకాన్ పర్యాటక సమాచార మొబైల్ మ్యూజియంను కర్రిగుట్టల ప్రాంతంలోని పర్యాటక కేంద్రాల్లో గైడ్‌లుగా సేవలందించేందుకు ఎంపికైన యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని వారు ప్రారంబించారు.ములుగు ఎస్పి మాట్లడుతూ ములుగు జిల్లాలో రామప్ప మేడారం లక్నవరం మల్లూరు బోగత జలపాతం ఇతర పర్యాటక చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు వాటి ప్రాముఖ్యతను వివరించి రాష్ట్రంలో ములుగు జిల్లాను పర్యాటక రంగంలో ముందుంచడానికి టూరిస్ట్ గైడ్ లు కృషి చేయాలని వారు అన్నారు.పర్యాటకులకు సేవలను అందించి వారి మన్నలను పొందాలని కూడా అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాలు చారిత్రాత్మక నేపథ్యం పర్యాటకులకు అందించాల్సిన సమాచారం పర్యాటకుల పట్ల గైడ్‌లు అనుసరించాల్సిన విధానాలపై ఉమ్మడి జిల్లా పర్యాటక అధికారి శివాజీ రామప్ప టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ అవగాహన కల్పించారు.ములుగు జిల్లా గిరిజన సంస్కృతి సంప్రదాయాలు స్థల పురాణం ఏటూరు నాగారం అభయ అరణ్య ప్రకృతి అందాలను పర్యాటకులకు సుందరంగా వివరించే విధానాన్ని తెలియజేశారు.తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ మ్యూజియాన్ని ఎస్పీ కార్యలయలో జిల్లా ఎస్పీ ప్రారంభించారు.మొబైల్ మ్యూజియంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు ప్రత్యేక ఆకర్షణలు పర్యాటక విశేషాలు ప్రదర్శనకు ఉన్నాయని మైబైల్ మ్యుజియం అద్భుతంగా ఉందని రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమచారం అద్భుతంగా ఉందని కోనియాడారు.పర్యాటకులకు అవసరమైన సమాచార బ్రోచర్లు సమాచార పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ మొబైల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. శివాజీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్ డిఎస్పీ రవీందర్ డిపిఆర్ఓ రఫీక్ డిటివో శివాజీ గైడ్ విజయ్ కుమార్ టూరీస్ట్ పోలీస్లు అరుణ్ శ్రీకాంత్ టూరిజం సిబ్బంది అనంద్ తథితరులు పాల్గొన్నారు.