Home Uncategorized బాలిక వేధింపుల ఆరోపణలు.. చర్యలేవి?

బాలిక వేధింపుల ఆరోపణలు.. చర్యలేవి?

6
0
  • మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ప్రశ్న

మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మే 11:

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్‌పై మైనర్ బాలిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడం ఆందోళనకరమని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఈ ఘటనను మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించిందన్నారు.
బాలిక తల్లిదండ్రులు స్వయంగా పిటిషన్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. సామాన్యులపై వెంటనే కేసులు నమోదు చేసే ప్రభుత్వం, అధికార పార్టీలకు చెందిన వ్యక్తుల విషయంలో మాత్రం మౌనం పాటిస్తోందని విమర్శించారు. మైనర్ బాలికపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంటూ, వెంటనే బండి భగీరధ్‌పై పోక్సో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల భద్రతపై పెద్ద ఎత్తున మాట్లాడే బీజేపీ నాయకులు ఈ ఆరోపణలపై స్పందించాలని అన్నారు.
మహిళలు, బాలికలపై దౌర్జన్యాలకు పాల్పడే వారికి రాజకీయ హోదాలు, కుటుంబ నేపథ్యాలు రక్షణ కవచంగా మారకూడదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని భాస్కర్‌రావు స్పష్టం చేశారు.