Home agriculture సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలు సాగు చేయాలి

సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలు సాగు చేయాలి

11
0
  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించాలి
  • పంటల విభిన్నీకరణ, ప్రత్యామ్నాయ సాగుతోనే రైతులకు ఆర్థిక భరోసా
  • నీటి సంరక్షణ పద్ధతులు, మిశ్రమ పంటల సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలి
  • ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మే 5 :

రైతులు కేవలం సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటల సాగును విస్తరించుకోవాలని ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని భువన గార్డెన్స్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, రెండవ రోజు “ఉద్యాన పంటల సాగు”పై నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు పంటల విభిన్నీకరణ అత్యంత ఆవశ్యకమని, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ ఆటోమేషన్, సిరికల్చర్, ఆయిల్ పామ్ స్టాళ్లను ఆయన పరిశీలించి, ఆధునిక పద్ధతులపై ఆసక్తిగా ఆరా తీశారు. నీటి సంరక్షణ పద్ధతులు పాటించడం వల్ల సాగు ఖర్చు తగ్గి లాభాలు పెరుగుతాయని, వాతావరణ మార్పులను తట్టుకునే పంటలపై అవగాహన కలిగి ఉండాలని రైతులకు హితవు పలికారు. నిపుణులు వివరించిన సాగు మెళకువలను పాటించి రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు. ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుదల వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు క్షేత్రస్థాయిలో వివరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జె. కిషోర్, ఉద్యాన అధికారి డి. దేవప్రసాద్, హెచ్.ఈ.ఓ వసంత, టిఏసిఎస్ అధ్యక్షులు మండే హనుమంతరావు, ఏ.ఓలు, ఏ.ఈ.ఓలు, రైతులు పాల్గొన్నారు.