Home తెలంగాణ ఆన్ డ్యూటీ పేరుతో విధులకు డుమ్మా

ఆన్ డ్యూటీ పేరుతో విధులకు డుమ్మా

22
0
  • ఉపాధ్యాయుడిపై డీఈఓకు ఫిర్యాదు
  • ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు వేసుకొని ఇతర స్కూళ్లలో సంచారం
  • క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 31:

పెద్దపల్లి జిల్లాలో ఆన్ డ్యూటీ పేరుతో విధులకు గైర్హాజరు అవుతూ తిరుగుతున్న ఓ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు నమోదైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అలుగువెల్లి సరోత్తం రెడ్డి (స్కూల్ అసిస్టెంట్ – ఫిజికల్ సైన్స్)పై మహిళా సీనియర్ సామాజిక కార్యకర్త రాం. పద్మ పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఓదెల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుంపులలో పనిచేస్తున్న సదరు ఉపాధ్యాయుడు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు నమోదు చేసుకుని, ఆన్ డ్యూటీ పేరుతో ఇతర పాఠశాలల్లో సంచరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మార్చి 12, 2026న కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)లో కనిపించడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
అలాగే, ప్రధానోపాధ్యాయుడు మరియు ఓదెల ఎంఈఓను మభ్యపెట్టి, ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు అనంతరం ఓడీ పేరుతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా డీటీఓ, ఎస్టీఓ కార్యాలయాల పనుల నిమిత్తం తిరుగుతున్నట్లు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులను తప్పుదోవ పట్టిస్తూ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సరోత్తం రెడ్డి పై తక్షణమే క్షేత్రస్థాయి విచారణ జరిపించి తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాం. పద్మ డిమాండ్ చేశారు.