Home ఖమ్మం ముసుగేసిన ముంపు.. కథనానికి స్పందన

ముసుగేసిన ముంపు.. కథనానికి స్పందన

17
0

చింతకాని,ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 10:

మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామపంచాయతీ పరిధిలో రామకృష్ణాపురం
వైకుంఠ దామం నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు నాటిన మొక్కలు విపరీతంగా పెరిగి ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యే విధంగా యాక్సిడెంట్లు అవ్వడంతో ‘ఆర్గాన్ న్యూస్’ లో వచ్చిన వార్త కథనానికి స్పందించిన గ్రామపంచాయతీ కార్యాలయం,ఉప సర్పంచ్ గాదె రామారావు దగ్గరుండి చెట్లు కొమ్మలు నరికించటం మొదలుపెట్టడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ నల్లగట్ల మురళి కృష్ణ , గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.