ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 6: అండర్ 19 వన్డే ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 412 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ తడబడి 311 పరుగులకు ఆలౌటైంది. ఫాల్కనర్ శతకం వృథా అయింది. భారత బౌలర్లలో అంబ్రిష్ 3, దీపేశ్ 2 వికెట్లు తీయగా.. ఖిలాన్, కనిష్క్, ఆయూష్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(175) భారీ ఇన్నింగ్స్ ఆడాడు.


