Home వైరల్ కాంతా దాసులు !

కాంతా దాసులు !

16
0

ఆర్గాన్ న్యూస్, జనవరి 28 : మూడు పార్టీలకు
ఈ “భంచిక్, భంచిక్” వ్యాధి “సెగ” బాగానే తగులుతున్నట్లుంది…
ఇక లాభం లేదు,
అందరం ఏకమై, “అఖిలపక్షం” వేసుకొని,
ఢిల్లీ వెళ్లి, ఈ “వ్యాధికి” ఏదైనా “వ్యాక్సిన్” కనిపెట్టమని,
“మోడీ” గారికి మొరపెట్టుకోవాల్సిందే..
మొన్నటికి మొన్న “పవన్ కళ్యాణ్” గారు “జనసైనికులు జాగ్రత్త” అనే “హింట్” ఇచ్చారు.
వింటేనా మరి, ఏకంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే, “అరవ శ్రీధర్” గారు కెమెరాలో అడ్డంగా బుక్ అయ్యారు. బాధితురాలు మీడియా “సాక్షిగా” బావురుమంది…
అంత క్రితం,
“సత్యవేడు” ఎమ్మెల్యే
“కొనేటి ఆదిమూలం”, కూడా,పాడు కెమెరాల్లో చిక్కి,”టీడీపీ” సస్పెన్షన్కు గురయ్యారు.
మాజీ ఎంపీ
“గోరంట్ల మాధవ్” గారు
“హాని ట్రాప్” వలలో చిక్కి వైఎస్సార్సీపీ నుండి సస్పెన్స్ కి గురయ్యారు. పాపం పోయిన ఎన్నికల్లో టికెట్ కూడా దక్కలేదు…
అందుకే మరి, “మోహరహిత “
“టీకా”, “టాబ్లెట్” ఏదో ఒకటి కనిపెట్టి,
ఆ “బి పామ్” ఇచ్చిన రోజే , వీళ్ళ గొంతులో టాబ్లెట్ వేసి, పిర్ర కు
ఓ ఇంజక్షన్ చేస్తే పోలా?

~ రాంబాబు జంగా