Home ఖమ్మం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర

30
0
  • మోడీ ప్రభుత్వంపై సీపీఎం తీవ్ర ఆరోపణలు
  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు

బోనకల్, జనవరి 17,ఆర్గాన్ న్యూస్:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు.
శనివారం బోనకల్ మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశం వ్యకాస మండల అధ్యక్షుడు తెల్లాకుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సీపీఎం పోరాటాల ఫలితంగా దేశానికి సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం పేరులో ఉన్న మహాత్మా గాంధీ పేరును తొలగించి ‘జీ రామ్ జీ’ పేరును చేర్చేందుకు పార్లమెంటులో బిల్లు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
పేరు మార్చడమే కాకుండా, ఉపాధి హామీ పనులకు నిధులు తగ్గించడం, పనిదినాలు కుదించడం, కూలీల హక్కులను కాలరాయడం వంటి చర్యల ద్వారా ఈ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. పేదల ఉపాధి హక్కులపై జరుగుతున్న ఈ దాడిని సీపీఎం ఎట్టి పరిస్థితుల్లో సహించదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బంధం శ్రీనివాసరావు, నోముల పుల్లయ్య, కొమ్ము కమలమ్మ, ఉప్పర శ్రీను, కూచిపూడి మురళి, సూర్యప్రకాశ్ రావు, కోట వెంకటి, పిక్కల సీతారాములు, కర్లకుంట ముత్తయ్య, చేపూరి వెంకటేశ్వర్లు, ముంగి వెంకన్న, కొంగర భూషయ్య, కొమ్మినేని సీతారాములు, దూబ భద్రాచలం తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకం పేదల జీవనాధారమని, దాన్ని కాపాడుకునేందుకు కార్మికులు ఏకమై పోరాడాలని సమావేశం పిలుపునిచ్చింది.