Home ఎడిటోరయిల్‌, ఆర్గాన్ న్యూస్ సర్వజన క్రాంతి “సంక్రాంతి”

సర్వజన క్రాంతి “సంక్రాంతి”

17
0

ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి:

తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ ప్రవేశిస్తుంది. ప్రభాత సమయాను చలిలో నులివెచ్చని సూర్యుని లేత కిరణాల వెలుగులు రంగవల్లులతో అలంకరించిన ముంగిళ్ళలో సంక్రాంతి శోభ నాట్యం ఆడుతోంది. ఇది జనజీవనంతో ప్రకృతితో వ్యవసాయ కార్యకలాపాలతోనూ సంబంధం ఉన్న పండగ. మరోపక్క ఆధ్యాత్మికతను దీనికి సంబంధం ఉంది పండితులు నుంచి పామర్రు దాకా అందరిని స్పృశించే పండగ ఇది. అందుకే ఇది పెద్దల పండగ అయింది. సంక్రాంతి మూడు రోజులు పండుగ మొదటిరోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ ముఖ్యమైనవి. నాలుగవ రోజులు ముక్కనుమ అని కూడా పిలుస్తారు సంక్రాంతి పండగ వచ్చింది అంటే పిల్లల సందడికి హద్దు ఉండదు. ఈ పండగ నాలుగు రోజులు ముగ్గులు గొబ్బెమ్మలు అరిసెలు, సకినాలు హరిదాసులు, గంగిరెద్దులు, జంగమ్మ దేవరలు గాలిపటాలు రెపరెపలే ఎటుచూసినా కనబడతాయి. సంక్రాంతి పండగ ఏమిటనేది ఈ వ్యాస సారాంశం

భోగి

భోగి అనే పదం బుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చిందని చెబుతారు అయితే జన సామాన్యం వాడుకలో ఉన్న పొంగు అనే పదం మార్పు కింది భోగి అయ్యిందని కొందరి వాదన. ఆధ్యాత్మికంగా చూస్తే రంగనాథుడు గోదాదేవిని వివాహం చేసుకొని భోగభాగ్యాలు అనుగ్రహించిన రోజు కనుక దీనికి భోగి అని పేరు వచ్చిందని పురాణ కథనం. వ్యవసాయపరంగా పంటను చేతికి వస్తాయి కొత్తగా వచ్చిన బియ్యంతో పరమాన్నం లేదా పొంగలి చేసి అది బంధుమిత్రులతో కలుసుకొని భోగ విలాసాలతో తులతూ ఏ రోజు కనుక దీనికి భోగి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక ఈరోజు ఆచారాల విషయానికి వస్తే తెల్లవారుజామున చలిలో భోగి మంటలు వేయడం ఆచారం ధనుర్మాసం నెల రోజులు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి వాటిని దండగా కుచ్చి మంటలలో వేయడం కూడా కనిపిస్తుంది. తాత్వికంగా దేనిని అశుభాన్ని కాల్చి వేయడం గా భావించిన లౌకికంగా చూస్తే ఈ ఆచారం రావడానికి కారణం ఈ సమయంలో ధాన్యం ఇంటికి వస్తుంది కనుక వాటిని భద్రపరిచేందుకు రైతులు గాదెల వంటి వాటిని శుభ్రం చేసి చెత్తను వదిలించుకోవడానికి దానిని అగ్నిలో వేసి దహించే వారిని దాని నుంచి ఈ ఆచారం వచ్చిందని చెబుతారు. భోగి రోజును ఇంద్రునికి ఇష్టమైన రోజుగా చెబుతారు . భాగవతంలోకి తొంగి చూస్తే ఒకప్పుడు ఇంద్రుడు తనకు బోగినాడు ప్రజలు చేసే పూజలు చూసి గర్వపడ్డాడని దానిని అణిచివేసేందుకు కృష్ణుడు ఇంద్రుని పూజలు మాని గోవర్ధనగిరిని పూజించమన్నాడని కథ ఉంది దానికి ఇంద్రుడు కోపించడం కృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగుల పట్టడం ఇంద్రునికి గర్వభంగం కావడం స్వామి కరుణించి మళ్లీ పూజలు కొనసాగించడం తద్వారా ఇంద్రుడు సంతోషించడం అనే కథ అందరికీ తెలిసిందే. ఇక వామనుడి చేత పాతాళానికి తక్కిపోయబడిన బలి చక్రవర్తి తాను గతంలో పాలించిన భూమి మీద ప్రజలు ఎలా ఉన్నారో చూసేందుకు సంక్రాంతి రోజున భూమి మీదికి వస్తాడని చెబుతారు పంచాంగాలను చెప్పే సంక్రాంతి పురుషుడు ఆయనేని కొందరు పేర్కొంటారు.

భోగి రోజున సాయంత్రం చిన్న పిల్లలు ఉన్నవారు వారికి భోగి పళ్ళు పోస్తారు బాల అరిష్టాలకు గుర్తుగా ఈ వేడుక చేస్తారు అంతేగాక రేగు పండును సంస్కృతంలో బదిలీ అంటారు రేగు చెట్టు అంటే విష్ణువు ఇష్టం అందువల్లనే ఆయనను బద్రీ నారాయణ అని కూడా అంటారు విష్ణువుకు ప్రీతికరమైన ఈ పళ్ళు పోయడం వల్ల వారికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు.

సంక్రాంతి

సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు సాగడం అనే అర్థం ఉంది అంటే సూర్యుడు ముందుకు సాగి మకర రాశిలోకి ప్రవేశించడానికి సంక్రాంతి సూచిస్తుంది సంవత్సరానికి 12 నెలలు ప్రతి నెలలోనూ సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఇలా 12 నెలలు 12 సంక్రమణాలు వస్తాయి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంచి మకర రాశిలోకి ప్రవేశించడానికి మకర సంక్రమణం అంటారు తులా రాశి నుండి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడానికి వృశ్చిక సంకరణం అంటారు అయితే వృశ్చిక మకర సంక్రాంతి ప్రాముఖ్యత ఎక్కువ ఈ మకర సంక్రమణ కాలం పుణ్యప్రదమైనది ఈ సందర్భంగా కొన్ని విధులు చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రవి సంక్రమణ సమయంలో స్నానం చేయనివాడు ఏడు జన్మలకు రోగి డబ్బు లేని వాడు అవుతాడని శాస్త్రం చెబుతుంది అందువలన ఈ సమయంలో స్నానం తప్పనిసరి విధి అని గ్రహించాలి. ఈ రోజున దానం కూడా చేయాలి. దానికి ఏమైనా సాంప్రదాయాలలో ఎంతో ప్రాధాన్యత ఉంది. సంక్రమణ సమయంలో దానాలు చేస్తే విశేష ఫలితం ఉంటుంది ఈ సంక్రమణ సమయంలో ఏ వస్తువులు దానం చేస్తారు అటువంటి ద్రవ్యాలే మనం ముందు జన్మలో సూర్యా అనుగ్రహంతో లోటు లేకుండా పొందుతారని అంటారు. ధాన్యం పండ్లు విసనకర్ర బట్టలు బంగారం కాయగూరలు దుంపలు నువ్వులు చెరుకు దానం చేయడం ఉత్తమం ఉత్తరాయణంలో నువ్వుల నూనెతో దీపారాధన నువ్వుల బియ్యం కలిపి శివుని పూజించడం నల్ల నువ్వులతో స్నానం చేయడం తిలాదానంలో భాగంగా తినడం చేయవలసింది తెల్ల నువ్వులతో దేవతార్పణ నల్ల నువ్వులతో పితృత తర్పణం చేయాలని పెద్దలు చెబుతారు దానాలలో ఎక్కువ తక్కువ ఖర్చుతో కూడుకున్నవి ఉన్నాయి డబ్బున్న వారు లోపంతో దానాన్ని మానకూడదు డబ్బు లేని వారు అప్పు చేసి దానం చేయకూడదని పెద్దల మాట .
సంక్రాంతి రోజున మనం చూసే ఇంకొక సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి కీత చేయించే నృత్యాలు చూడాలనియంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలకు స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగడం వంటి విద్యలు అందరికీ ఆనందం కలిగిస్తాయి అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వారు సందడి చేస్తారు కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో వారికి ధాన్యం ఇస్తారు హరిలో రంగా హరి అంటూ నడిరెత్తి పైనుండి నాసికదాకా తిరుమణి పట్టిలతో కంచు గజ్జలు గళ్ళు గళ్ళు మొనగా చిందులు తొక్కుతూ చేతులతో చిరుతల కొడుతూ హరిదాసు ప్రత్యక్షమవుతాడు బసవన్న కిందులు శివుని ప్రత్యక్ష దైవంగాను హరిదాసులు విష్ణుమూర్తి స్వరూపంగానూ భావిస్తాము.