Home తెలంగాణ కారణజన్ములు ఘంటసాల

కారణజన్ములు ఘంటసాల

47
0
  • కరుణాకర్ టైమ్స్ ఆఫ్ ఇండియా రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 5: కారణజన్ములు ఘంటసాల వెంకటేశ్వరరావు అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న జర్నలిస్టు కరుణాకర్ అన్నారు. నల్లగొండలో ఘంటసాల 103 వ జయంతి సందర్భంగా గురువారం చిన్న వెంకటరెడ్డి మినీ ఫంక్షన్ హాల్ రవీందర్ నగర్ లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంగీత సాధన కోసం జోలె పట్టి వారాలు చేసుకుని అన్నం తిని, ఎంతోమంది దర్శకులు నీ గొంతు సినిమాకు పనికిరాదు అని దూషణ భూషణులు చేసిన పట్టు పట్టి సంగీత ప్రపంచంలో తెలుగు ప్రజలు చేసుకున్న కొంచెం పుణ్యంతో తెలుగు వాడిగా పుట్టిన ఘంటసాల నిజంగా అద్భుతమైన వ్యక్తి అని అలాంటి శక్తి వ్యక్తి
    మళ్ళీ పుట్టడని కరుణాకర్ అన్నారు. గౌరవ అతిధి ప్రసిద్ధ న్యాయవాది అక్కినేపల్లి మురళీధర్ రావుమాట్లాడుతూ సంగీతం, రాష్ట్రాలకు ప్రాంతాలకు, దేశాలకు, అతీతం అని ఎక్కడో చౌటపల్లిలో పుట్టిన ఘంటసాల వెంకటేశ్వరరావు ఈరోజు ప్రతి ఇంట్లో ఒక గీతామృతాన్ని పంచుతు నభూతో నభవుషతి అనే చందంగా తెలుగు వారి హృదయాలలో గూడు కట్టుకొని ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్. సింధూర ఎం ఉన్నతి ప్రార్థన గీతం పాడగా కార్యక్రమాన్ని గుండ్లపల్లి సుమలత వి ఆర్ కే పణి, టి అంజి బాబు, ప్రధాన్య, రిషిల్( హైదరాబాద్) పాల్గొనగా కార్యక్రమం సమర్పణ కొలనుపాక రవికుమార్ ఎం.వి.ఆర్ విద్యాసంస్థల అధినేత. హాజరయ్యారని కార్యక్రమ పర్యవేక్షణ ఘంటసాల కల్చర్ అసోసియేషన్ నల్లగొండ డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య, ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

అలరించిన సంగీత విభావరి

కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన అక్కినేపల్లి మురళీధర్ రావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాయని గాయకులు పాడిన గోరింక గూటికే చేరావే చిలక, నిన్న లేని అందం ఏదో నిదుర లేపేనెందుకో అలిగిన వేళ ని చూడాలి, ఈనాటి ఈ హాయి ఏనాటిదో,, పాట పాడనా ప్రభు అనే ఘంటసాల గొంతు నుండి జాలువారిన పాటలు గాయనీ గాయకులు పాడి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమం అనంతరం కార్యక్రమాన్ని నిర్వాహకులు శ్రీ ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ నల్లగొండ నిర్వాహకులు పురుషోత్తమాచార్యులు వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.