Home ఖమ్మం ఉత్సాహంగా టైలర్స్ దినోత్సవం

ఉత్సాహంగా టైలర్స్ దినోత్సవం

29
0

మున్సిపల్ చైర్మన్‌కు టైలర్స్ యూనియన్ సన్మానం

కల్లూరు,ఆర్గాన్ న్యూస్,ఫిబ్రవరి 28 : ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా కల్లూరు పట్టణంలో టైలర్స్ సంఘం ఆధ్వర్యంలో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్‌ను కల్లూరు మండల టైలర్స్ యూనియన్ సభ్యులు శాలువాలు కప్పి,పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు.టైలరింగ్ వృత్తిలో కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదిగి మున్సిపల్ చైర్మన్ స్థాయికి చేరుకోవడం గర్వకారణమని సంఘం నాయకులు పేర్కొన్నారు.తమ వృత్తికి చెందిన వ్యక్తి పట్టణ అభివృద్ధి బాధ్యతలు చేపట్టడం టైలర్స్ సమాజానికి ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా చైర్మన్ మోహన్ నాయక్‌ను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు.చైర్మన్ మోహన్ నాయక్ మాట్లాడుతూ, టైలరింగ్ వృత్తి తనకు జీవనాధారాన్ని ఇచ్చిందని, ఆ వృత్తి పట్ల ఎప్పటికీ గౌరవ భావం ఉంటుందని తెలిపారు.టైలర్స్ సంక్షేమం,వారి సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.వైస్ చైర్మన్ కూడా టైలర్స్ అభివృద్ధికి మున్సిపాలిటీ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పట్టణంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పింది.
ఈ కార్యక్రమంలో టైలర్స్ సంఘం అధ్యక్షులు రామవరపు వెంకటేశ్వరావు, బైర్ల కాంతారావు, మర్రేల శ్రీనివాసరావు,అరుణ శ్రీ, చంద్రకళ,చింతపల్లి నరసింహారావు,యాస రంగారావు,షఫీ వలి తదితర సభ్యులు పాల్గొన్నారు.