Home క్రైమ్ రాత్రింబవళ్ళు అక్రమ ఇసుక రవాణా

రాత్రింబవళ్ళు అక్రమ ఇసుక రవాణా

49
0
  • మైనింగ్,రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం
  • మోతె మండలానికి అక్రమ ఇసుక తరలింపు
  • పేదల ఇళ్లకు ఇసుక లేదు…దోపిడీదారులకు పుష్కలం! తిరుమలాయపాలెం, ఆర్గాన్ న్యూస్, జనవరి 4 :

సోలిపురం,కాకరవాయి గ్రామాల పరిధిలోని రెవెన్యూ భూముల్లో అక్రమ ఇసుక డంపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.చట్టాలను లెక్కచేయకుండా వందల ట్రిప్పుల ఇసుకను నిల్వ చేసి, మరోవైపు రాత్రింబవళ్ళు అక్రమంగా తరలిస్తున్నారు.అక్రమ ఇసుక రవాణా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ మైనింగ్ రెవెన్యూ, అధికారులు చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గ్రామాల్లో ట్రాక్టర్లు, లారీలతో ఇసుక తరలింపులు జరుగుతున్నా ఎక్కడా చెక్‌పోస్టులు, పట్టివేతలు కనిపించడం లేదు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన “మన ఇసుక వాహనం” పథకం కాగితాలకే పరిమితమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమార్కులకు మాత్రం ఇసుక పుష్కలంగా దొరుకుతుండగా, పేదల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు మాత్రం ఇసుక కరువవుతోంది.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే…
ఈ అక్రమ ఇసుకను మోతే మండల పరిధిలోకి తరలిస్తున్న కాంట్రాక్టర్లు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు.
ఇది స్థానిక వనరుల దోపిడీకి, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టానికి దారితీస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.
అక్రమ ఇసుక డంపులపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ, బాధ్యులపై కేసులు నమోదు చేయాలనీ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.