Home తెలంగాణ మలి దశ తెలంగాణ ఉద్యమకారులు మురళీధర్ దేశ్ పాండే కన్నుమూత

మలి దశ తెలంగాణ ఉద్యమకారులు మురళీధర్ దేశ్ పాండే కన్నుమూత

4
0
  • నివాళి అర్పించిన తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య అధ్యక్షులు పోచంపల్లి రమణారావు రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 10: తెలంగాణ ఉద్యమ చరిత్రలో తనది అయిన ముద్ర వేసి సీనియర్ నాయకులు సామాజిక కార్యకర్త కళాకారుల హక్కుల కోసం పోరాటం చేసిన పోరాటయోధుడు మురళీధర్ రావు దేశ్ పాండే కన్ను మూయడం బాధాకరమని తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య అధ్యక్షులు పోచంపల్లి రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు.
    బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రముఖ నాయకులు జానపద సకల కళాకారుల సంఘం అధ్యక్షులు మురళీధర్ రావు దేశ పాండే మరణం చాలా బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఉద్యమకారుడిగా రాజకీయ నాయకుడిగా సామాజిక సేవకుడిగా కళాకారుల మిత్రుడిగా మానవతావాదిగా ఎన్నో రంగాలలో తన సేవలు అందించడం మురళీధర్ రావు దేశ పాండే మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటని ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో, తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య అధ్యక్షులు పోచంపల్లి రమణ రావు తో పాటు ప్రధాన కార్యదర్శి కానాల శ్యాంసుందర్రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవులపల్లి రంగారావు, చెన్నూరి లక్ష్మీనరసింహారావు ( అన్వేషి) కోశాధికారి ఊరే ప్రసాదరావు, గూడా రాజేశ్వరరావు, గూడా జయరాం, సిద్దిపేట జిల్లా జాలిగామ కు చెందిన బ్రాహ్మణ సంఘం నాయకులు జెవి ఎల్ఎన్ నరసింహారావు ( సింహం పంతులు ) తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.