Home తెలంగాణ ఇండ్లు ఇచ్చారు సరే తాగేందుకు నీళ్లు ఏవి?

ఇండ్లు ఇచ్చారు సరే తాగేందుకు నీళ్లు ఏవి?

4
0
  • లెనిన్ నగర్ డబల్ బెడ్ రూమ్ నివాసితుల ఆందోళన
  • వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 10 : ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాగునీటి సరఫరా సౌకర్యం కల్పించకపోవడంతో నివాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. బడంగ్ పేట సర్కిల్ ప్రశాంతి హిల్స్ డివిజన్ లెనిన్ నగర్ వద్ద గల సర్వేనెంబర్ 119 లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం హయాంలో నాటి విద్యాశాఖ మంత్రి ప్రస్తుత మహేశ్వరం శాసనసభ్యులను సబితా ఇంద్రారెడ్డి స్థానిక ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేశారు. అయితే నాటి నుంచి నేటి వరకు సదరు ఇళ్లకు నీటి వసతి మాత్రం కల్పించలేదు. అటు శాసనసభ్యురాలు కానీ ఇటు జలమండలి అధికారులు కానీ ఈ విషయంలో పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ, డబల్ బెడ్ రూమ్ నివాసితులు పక్కనే గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన నిర్వహించారు మహిళలు సైతం ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు అధికారులు తమ సమస్యపై దృష్టి పెట్టి వెంటనే పరిష్కారం చేపట్టాలని వారి డిమాండ్ చేశారు స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు పలువురు మాజీ కార్పొరేటర్లు వారి ఆందోళనకు మద్దతు ప్రకటించారు కాగా విషయం తెలుసుకున్న జలమండలి అధికారులు అక్కడకు చేరుకొని నివాసితులతో చర్చలు జరిపారు వీలైనంత త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన నిర్మించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మీర్ పేట అధ్యక్షులు బిక్షపతి చారి, మాజీ కార్పొరేటర్ నీలా రవి నాయక్, శంకర్ నాయక్, బాలు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, ఏ భీమరాజు తదితరులు పాల్గొన్నారు.