Home Uncategorized సాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

సాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి

17
0
  • నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్ష

వనపర్తి ,ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి , మార్చ్ 7:

వనపర్తి నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులు, కెనాల్ లు, పంట కాలువలు, చెక్ డాంల లాంటి అనేక వాటిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి జిల్లా నీటిపారుదుల శాఖ అధికారులకు సూచించారు.ప్రస్తుతం కొనసాగుతున్న పనుల గురించి అధికారులతో చర్చించారు.గట్ల ఖానాపురం రిజర్వాయర్ ఏర్పాటులో తలెత్తే పలు పాఠశాల పై వారు చర్చించారు.అదేవిధంగా బుద్ధారం స్టేజ్ 2 గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన పలు సమస్యలపై వారు చర్చించారు.రిజర్వాయర్ ఏర్పాట్లు భూములు కోల్పోయే అన్నదాతలు అందరికీ తగిన నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.ఖాన్ చెరువు, ఎం జె9 కెనాల్ బుద్ధారం ఎడమ కాలువ, ప్యాకేజ్ నెంబర్ 27లో నిలిచిపోయిన పనుల పురోగతి గురించి వారు చర్చించారు.నల్ల చెరువు నుంచి అమ్మ చెరువు వరకు వెళ్లే కాలువల బలోపేతం పై ప్రత్యేక దృష్టి సారించి బాగు చేయాలన్నారు.ఇరిగేషన్ కి సంబంధించి నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అన్ని పనులను వెంటనే పూర్తి చేయాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సంసిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.