Home POLITICS విప్లవ స్ఫూర్తికి మరో మైలురాయి

విప్లవ స్ఫూర్తికి మరో మైలురాయి

18
0
  • కేంద్ర కమిటీ సభ్యురాలిగా కామ్రేడ్ బండి పద్మ ఎన్నిక
  • విద్యార్థి ఉద్యమాల నుంచి మహిళా పోరాటాల వరకు
  • ఒక విప్లవ నాయకురాలి ప్రయాణం

ఖమ్మం / ఆర్గాన్ న్యూస్ / జనవరి 28 :

విప్లవ ఉద్యమాల చరిత్రలో మరో కీలక ఘట్టంగా, కేంద్ర కమిటీ సభ్యురాలిగా కామ్రేడ్ బండి పద్మ ఎన్నిక కావడం పట్ల విప్లవ శ్రేణులు, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ఆమెకు వివిధ ప్రజాసంఘాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య శిష్యుడైన విప్లవ యోధుడు నున్న పుల్లయ్య కుమార్తెగా జన్మించిన కామ్రేడ్ పద్మ, చిన్ననాటి నుంచే విప్లవ భావజాలంతో పెరిగిన నాయకురాలు.
విద్యార్థి దశ నుంచే విద్యార్థి సమస్యలపై పోరాటాలు చేస్తూ, అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచిన ఆమె ప్రయాణం అనేక మంది యువతకు ఆదర్శంగా నిలిచింది.
అదే విప్లవ స్ఫూర్తితో, విప్లవ బాటలో నడిచే సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ బండి రమేష్ ని ఆదర్శ వివాహం ద్వారా జీవిత భాగస్వామిగా ఎంచుకుని, వ్యక్తిగత జీవితాన్నికూడా ఉద్యమంతో ముడిపెట్టిన అరుదైన నాయకురాలు కామ్రేడ్ పద్మ.
గ్రామ పాలనలోనూ ఆమె అసాధారణ ప్రతిభను చాటుకున్నారు.
చిరుమర్రి గ్రామ సర్పంచ్‌గా 13 సంవత్సరాల పాటు పనిచేసి, అభివృద్ధి, పారదర్శక పాలనకు చిరునామాగా నిలిచారు.
గ్రామాభివృద్ధిలో ఆమె చేసిన కృషికి అనేక అవార్డులు లభించడమే కాక, ఇతర దేశాల ప్రతినిధులు గ్రామాన్ని సందర్శించే స్థాయికి చిరుమర్రిని అభివృద్ధి చేశారు.
ముదిగొండ కాల్పుల ఘటన సమయంలో ఆమె చూపిన నాయకత్వ పటిమ జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గ్రామ అగ్ర నాయకత్వం మొత్తం నిర్బంధంలో ఉన్న పరిస్థితుల్లోనూ,
గ్రామ ప్రజలను, పార్టీని కాపాడుతూ ధైర్యంగా ముందుండి నడిపించిన నాయకత్వం కామ్రేడ్ పద్మదే అని ఆ సమయంలో ప్రజలు ప్రశంసించారు.
జిల్లాలో మహిళా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ,
అనేక మహిళా ఉద్యమాలను ముందుండి నడిపించిన ధీర మహిళా నాయకురాలిగా ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

ఐద్వా (AIDWA)లో

గ్రామ స్థాయి నాయకురాలిగా,
మండల నాయకురాలిగా,
డివిజన్ నాయకురాలిగా,
ఖమ్మం జిల్లా ఐద్వా సెక్రెటరీగా,
తెలంగాణ రాష్ట్ర ఐద్వా జాయింట్ సెక్రెటరీగా
దశలవారీగా ఎదుగుతూ, నేడు కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఎన్నిక కావడం ఆమె విప్లవ ప్రయాణానికి దక్కిన అత్యున్నత గుర్తింపుగా నిలిచింది.
కామ్రేడ్ బండి పద్మ ఎన్నికతో
మహిళా ఉద్యమాలకు, విప్లవ రాజకీయాలకు మరింత బలం చేకూరుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
ఆమె అనుభవం, ధైర్యం, నిబద్ధత కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.