Home తెలంగాణ నగర అభివృద్ధి, తాగునీటి సమస్యలపై వినతి

నగర అభివృద్ధి, తాగునీటి సమస్యలపై వినతి

71
0
  • ఖమ్మం మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన డా. తుమ్మల యుగంధర్

ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, మార్చి16:

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. తుమ్మల యుగంధర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే డ్రెయినేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, విద్యుత్ లైన్లు మరియు విద్యుత్ స్థంభాలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలని కోరారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కమిషనర్‌ను అభ్యర్థించారు.
అందరూ సమిష్టిగా కృషి చేసి “స్వచ్ఛ ఖమ్మం” లక్ష్యాన్ని సాధించాలని డా. తుమ్మల యుగంధర్ తెలిపారు.