Home తెలంగాణ డాక్టర్స్ కాలనీలో స్వామి వివేకానంద 163 వ జయంతి

డాక్టర్స్ కాలనీలో స్వామి వివేకానంద 163 వ జయంతి

22
0
  • డాక్టర్స్ కాలనీ ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు రంగారెడ్డి ప్రతినిధి,ఆర్గాన్ న్యూస్, జనవరి 12: సరూర్నగర్ డాక్టర్స్ కాలనీ రోడ్ నెంబర్ 1 లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి 163 వ జయంతి సందర్భంగా పూలమాలవేసి ఘన నివాళి అర్పించడం జరిగిందని డాక్టర్స్ కాలనీ ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నాడు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ యువకులలో వారి రక్తాలలో ధైర్యాన్ని నింపిన మహనీయుడు వివేకానంద అని కొని ఆడారు. జీవితంలో అంతా కూలిపోయాం అనే వాళ్ళు వివేకానంద జీవితాన్ని ఒక్కసారి చదవాలని కోరారు. కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడిన లేస్తున్నందుకు అని సగర్వంగా చెప్పారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉపాధ్యక్షులు వన్నాడి శ్రీనివాస్, జనార్ధన్ రెడ్డి, దయాకర్, నరేష్, అనంతరెడ్డి, సీనియర్ సిటిజన్ సభ్యులు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్, రాజయ్య, రాజమౌళి, అన్నా రెడ్డి దశరథ రెడ్డి, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.