Home తెలంగాణ గుయ్ మంటున్నాయి…

గుయ్ మంటున్నాయి…

35
0

*సాయంత్రమైతే చాలు దోమల సైరన్ కాటేసి మంచాన పడేస్తున్నాయి.

  • కంపు కొడుతున్న మూసి పరివాహక ప్రాంతం.
  • మురిగిన కోట్లాది రూపాయలు – అటకెక్కిన మూసి సుందరీకరణ. ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి, రంగారెడ్డి: మూసి పరివాహక ప్రాంతంలో దోమలు “గుయ్య్” మంటున్నాయి. ప్రజలపై దాడికి సైరన్ మోగిస్తున్నాయి. సాయంత్రం ఐదు అయిందంటే చాలు స్వైర విహారం చేస్తూ కాటేస్తున్నాయి. రాత్రి వేళలో నది తీర ప్రాంత ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని తేడా లేదు నగరంలో ఈ వేసవిలో దోమల బెడద పెరిగింది. బస్టాండ్లలో నిలబడే ప్రయాణికుల తలలపై గుంపులు గుంపులుగా దోమలు దాడి చేస్తున్నాయి. దీనికంతటికీ కారణం మూసిలో మురుగుపేరుకపోవడమే చెత్తాచెదారం చేరి పిచ్చి మొక్కలు వేపుగా పెరిగి దోమలకు ఆవాసంగా మారింది. ఏళ్ల తరబడి మూసి ప్రక్షాళన అంటూ కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా అధికారుల అలసత్వం పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూసి శుద్ధికి నోచుకోవడం లేదు. ఫలితంగా మూసి సుందరీ కరణ అటకెక్కింది. ఈ నేపథ్యంలో మూసిలో దోమలను అరికట్టడమేమో కానీ రోజురోజుకు మరింత వృద్ధి చెందుతున్నాయని ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని భావించి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలను ప్రశ్నించింది ఒక్కసారి మూసీ నది పరిసరాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. అయినా చలనమేది. రాత్రి అయ్యిందంటే మూసికి ఇరువైపులా హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, సిటీ కాలేజీ, సాలార్జంగ్ మ్యూజియం, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ ఉస్మానియా దంత కళాశాల, కేంద్ర గ్రంథాలయం, వంటి పేరుగాంచిన సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో దోమల స్వైర విహారం చేస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వ్యాధులు విజృంభించడం రోజురోజుకు నగరంలో డెంగీ జ్వరాలతో మృతి చెందే వారి సంఖ్య పెరుగుతూ ఉండడం తో హైకోర్టు స్పందించి ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది అయినా అధికారుల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం హైకోర్టు ముందు ప్రవహిస్తున్న మూసిలో దోమలు విపరీతంగా పెరిగిపోవడం అధికారుల పనితనానికి నిదర్శనం ఒకవైపు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించిన అదే కోర్టు ముందు రాత్రి ఏడు దాటిందంటే దోమల కారణంగా నిలబడే పరిస్థితులు లేవు మూసి పరివాహక ప్రాంతంలోని కొంత భాగం పార్కులు ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించి ఆదిలోనే వదిలివేశారు దీనితో మూసి ఇరువైపులా పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు గడ్డి ఎక్కువగా పెరిగి దోమలకు ఆవాసాలుగా మారాయి పురాణా ఫుల్ సి ఏ ఆర్ మోటార్ ట్రాన్స్పోర్ట్ నుంచి శివాజీ చౌక్ కొరకు ప్రవహించే మూసీ నది ఒడ్డున వ్యాపారాలు చేసే వారిపై చీకటి పడితే చాలు దోమలు దండెత్తుతున్నాయి ప్లేట్ల బురుజు ఆసుపత్రి ఉస్మానియా ఆసుపత్రులలోని పలువార్లలో రాత్రి అయితే కిటికీలు మూసివేసిన దోమలు కాటు వేస్తున్నాయి. నిధులు వృధా మూసి నది ప్రక్షాళనకు కోట్ల నిధులు తెచ్చి మూసీ నదిలో పూసిన శుద్ధి కావడం లేదు రెండు దశాబ్దాల కాలంలో వందల కోట్లు ఖర్చు చేసిన క్షేత్రస్థాయిలో ఇసుమంతైన పనులు కనిపించడం లేదు సరి అయిన ప్రణాళికలు లేకపోవడం నిర్వహణలో చిత్తశుద్ధి లాంటివి లేక పనులు గాలికి వదిలివేయడం తదితర కారణాల వల్ల మూసికి ఖర్చు చేసిన నిధులు మురుగులు అనే కొట్టకపోయాయి 2001లో మూసీ నదిని శుద్ధి చేసేందుకు అందులోకి మురుగునీరు వదులుతున్న నాలాలపై ప్రత్యేక పైపులైన్ల ద్వారా మళ్ళించి శుద్ధి చేసి మళ్లీ నదిలోకి వదిలేందుకు వీలుగా ఒక కార్యచరణ సిద్ధం చేశారు. అటెట్ మెంట్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ రివర్ మూసి అనే ప్లాన్ సిద్ధం చేశారు ఈ పనులు అప్పట్లో ప్రధానమంత్రి వాజ్పాయ్ ప్రారంభించారు కేటాయించిన 350 కోట్ల నిధులతో కేంద్ర ప్రభుత్వం 70% రాష్ట్రప్రభుత్వం 30% వాటాలతో కలిసి పనులు ప్రారంభించారు కానీ ఎక్కడా పనులు జరిగిన దాఖలాలు లేవు కానీ ప్రజలను మాత్రం దోమలు కుట్టి చంపుతున్నాయి.