Home క్రైమ్ యువతిని కిరాతకంగా హత్య చేసిన యువకుడు

యువతిని కిరాతకంగా హత్య చేసిన యువకుడు

27
0
  • చితక భాదిన స్థానికులు.. ఆపస్మారక స్థితిలో హంతకుడు జడ్చర్ల ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మే 16: జడ్చర్ల మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళుతున్న యువతిని ఒక యువకుడు అతి కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అక్కడే ఉన్న స్థానికులు యువకుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయి గడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి (22) పోలేపల్లి ఎస్ వి కే యం పాఠశాలలో విధులు నిర్వహిస్తుంది రోజులాగే పాఠశాల ముగియగానే ఇంటికి బయలుదేరింది అయితే వైష్ణవి గత కొంతకాలంగా వేధిస్తున్న హైదరాబాద్ కు చెందిన రామచంద్ర అనే యువకుడు శనివారం అడ్డుపడ్డాడు మరొకసారి వైష్ణవిని వేధింపులకు గురి చేశాడు.. సరిగ్గా వైష్ణవి ఇంటి వద్దకు రాగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడి చేయడమే కాకుండా వైష్ణవి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో యువతి అక్కడికక్కడే మరణించింది. ఇది గమనించిన స్థానికులు పారిపోతున్న యువకుడ్ని పట్టుకొని తీవ్రంగా దాడి చేశారు ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.