Home Uncategorized ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

73
0

ఖమ్మం రూరల్, మార్చి 18:

ఖమ్మం రూరల్ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో భవాని (25) అనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వివరించారు. ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. పీజీ చదివిన భవాని పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా నోటిఫికేషన్లు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. మంగళవారం గడ్డి మందు తాగిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.