Home ఎడిటోరయిల్‌, ఆర్గాన్ న్యూస్ ప్రతి కూల పరిస్థితులలో సానుకూలంగా ఉండడముఅనే అంశము పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమము

ప్రతి కూల పరిస్థితులలో సానుకూలంగా ఉండడముఅనే అంశము పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమము

5
0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 15:

నేటి ప్రపంచములో మానవుడు జీవితములోఅనేక రకముల విపరీత పరిస్థితులను ఎదుర్కొంటున్నాడని, ఆ క్రమములో సమస్యల వెనుక పరిగెడుతూ రోజు రోజుకి తనవారికి దూరము అవుతున్నారని,దానివలన మానసిక అశాంతికి గురి అవుతూ ఒత్తిడితో, శారీరిక అనారోగ్యముతో జీవితాన్ని గడుపుతున్నారని, దీనికి పరిక్ష్కార మార్గము ఏమిటి? దీని సమాధానము కోసమే ప్రతి ఒక్కరూ ప్రతికూల పరిస్థితులలో సానుకూలంగా ఉండడం అనే అంశంపై నిర్వహిస్తున్న కార్యక్రమములో చేరాలని, మూడు రోజుల శిక్షణా శిబిరములో పాల్గొనాలని
బ్రహ్మకుమారీస్ ఒక ప్రకటనలో కోరారు.

విశేషాంశాలు
1 పరిస్థితి తాత్కాలికం, కానీ మన దృక్పథం శాశ్వతం.
2 తుఫాన్‌ను ఆపలేవు. కానీ నీ మనసును ప్రశాంతంగా ఉంచగలవు.
3 ఎదురుదెబ్బలు నేర్పిస్తాయి. ఆ పాఠాలే నిన్ను నిర్మిస్తాయి.
4 సానుకూలత అంటే నిజాన్ని తిరస్కరించడం కాదు, ఆశను నిలుపుకోవడం.
5 ఒత్తిడే వజ్రాలను తయారు చేస్తుంది.
ఈ 5 విషయాల యొక్క అసలు భావం:
అంగీకరించు → స్థిరంగా ఉండు → నేర్చుకో → ఆశతో ఉండు → ఎదుగుతూ ఉండు
ముఖ్య వక్త
బి.కె సచిన్ పరాబ్ , ఎంబీబీఎస్, స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ రీసెర్చ్, ట్రైనర్, కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్ విత్ ఏ క్లియర్ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ ఏ వ్యాల్యూ బేస్డ్ సొసైటీ
అనే సదస్సు(సెమినార్)ను కొత్తగూడెం పట్టణములో నిర్వహిస్తున్నామని, కావున ఈ సదావాకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆత్మిక సోదరిగా కోరుతూ హృదయ పూర్వక ఆహ్వానము పలుకుతున్నామని,కావున ప్రియ ఆత్మిక సోదరీ సోదరులందరు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని సదా సుఖ శాంతి సంతోష ఆయురారోగ్యములతో జీవించాలని మీ ఆత్మిక సోదరిగా కోరుకుంటున్నా తెలిపారు.
ఈ కార్యక్రమమును పట్టణ మేయర్ మూడ్ గణేష్ , సింగరేణి డైరెక్టర్ ఈ అండ్ ఎం , డైరెక్టర్ పిపి చేతుల మీదగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.