- మీర్ పేట భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, పసునూరి బిక్షపతి చారి రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, మార్చి 31: సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన ఓబీసీల కోసం ఉద్దేశించిన రిజర్వేషన్లను ముస్లింలకు వర్తింపజేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ, అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి విమర్శించారు. మంగళవారం నాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా కొన్ని రాష్ట్రాలు ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కనిపిస్తున్నాయని అన్నారు, తెలంగాణలో గతంలో ఓబీసీ జాబితాలోని ముస్లింలకు కాకుండా మిగతా ముస్లింల కొరకు ప్రత్యేకంగా నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు దీన్ని ఘటంలో హైకోర్టు కొట్టి వేసినప్పటికీ ఆ రిజర్వేషన్లు 12 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోను ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలే ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు మత ప్రాతిపదికన కల్పిస్తున్న ఇలాంటి రిజర్వేషన్లపై సమగ్రంగా సమీక్ష జరపాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ముస్లింల రిజర్వేషన్లను కొట్టి వేసిందని ఓబీసీ కేటగిరి హిందువుల కోసమేనని కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కులమతాల ప్రాతిపదికన విడగొట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు కాగా విపక్షాలు పోటీపడి ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయని బిక్షపతి చారి ఆవేదన వ్యక్తం చేశారు.








