Home ఎడ్యుకేషన్ ఏజెన్సీ ప్రాంతంలో మరో ఆణిముత్యం

ఏజెన్సీ ప్రాంతంలో మరో ఆణిముత్యం

21
0

పేద కుటుంబం నుండి ఉన్నత పదవిలో నిరు పేద బిడ్డ

డీఎస్పీ శిక్షణ పొందుతూనే సివిల్స్ సాధించిన ప్రవీణ్

ములుగు జిల్లా, ఆర్గన్ న్యూస్, మార్చి :07

మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగారం మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబం నుండి ఉన్నతమైన సివిల్స్ లో ర్యాంకు కొట్టి ఈరోజున పేదరికం చదువుకు అడ్డం కాదు అనే విధంగా ధైర్యం పెళ్లి ప్రవీణ్ నిరుద్యోగులకు ఒక దిక్సూచిగా తెలిసినట్లు తెలిపినట్లు ఉంది చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ వద్ద పెరుగుతూ ఎన్నో కష్టాలు పడుతూ గవర్నమెంట్ హై స్కూల్లో సాంఘిక సంక్షేమ గురుకులాలలో చదివి ఒక ఉన్నతమైన పోస్టులో ఉంటూ తన మిత్రులకు గానే తన శ్రేయోభిలాషులకు గాని ఇది ఒక సూచనగా ఉంది. ప్రవీణ్ నానమ్మ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తూ వీరి తమ్ముడిని ప్రవీణ్ ను ఎంతో కష్టపడే చదివించుకుంటూ పరిశుద్ధ కార్మికురాలుగా ఎటునాగారం గ్రామపంచాయతీలో పనిచేసింది. చదివించిన నానమ్మ ఫలితాన్ని వృధా చేయకుండా ఉన్నతమైన సివిల్స్ లో ర్యాంకు 793 వ ర్యాంకు సాధించినాడు ప్రవీణ్ సాధించిన ఈ విజయంపై తన స్నేహితులుగానే తన బంధువులు గాని వారి యొక్కవిజయం పైన హార్షం వ్యక్తం పరుస్తూ అభినందనలు తెలియ చేసినారు.