Home Adyatmikam శివాజీ ఒక ఆదర్శ పాలకుడు

శివాజీ ఒక ఆదర్శ పాలకుడు

19
0
  • జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి జడ్చర్ల ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 19: శివాజీ మహారాజ్ ఒక ఆదర్శ పాలకుడిగా అణగారిన వర్గాల విముక్తి ప్రదాతగా, పేరు పొందారని జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం నాడు రాజాపూర్ మండలం చత్రపతి శివాజీ మహారాజ్ 369వ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ అనగానే గొప్ప పోరాట యోధులు గుర్తుకు వస్తాడని శక్తివంతమైన మొగలాయి రాజులను తన యుద్ద తంత్రాలతో ఉనికించిన అద్వితీయమైన యుద్ధ నైపుణ్యమే గుర్తు కు వస్తుందని గుర్తు చేశారు రాజాపూర్ మండలం ఆరెకటిక మండల అధ్యక్షుడు కటికే కిషన్ జి ఆధ్వర్యంలో మటన్ మార్కెట్ లోని శివాజీ మహారాజ్ జయంతిలో పాల్గొన్నారు. సామాజిక పురోగతిలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని అర్థం చేసుకున్న శివాజీ అభ్యాసం జ్ఞానం వ్యాప్తిని ప్రోత్సహించారని విద్యాసంస్థలను స్థాపించారని పండితులను పోషించారని మేధో వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించారని నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలు సమాజాల వైపు చురుకైన ప్రమేయాన్ని శివాజీ విశ్వసించారని పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం తద్వారా పౌరులలో యాజమాన్యం బాధ్యతా భావాన్ని పెంపొందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరెకటికే సంఘం రాజాపూర్ మండల అధ్యక్షుడు కటికే కిషన్ జి, వెంకట్రావు ,బాబూలాల్, బాలరాజు, రాజు, రాజేష్, పాండు, నరేష్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.