Home క్రైమ్ కరీంనగర్‌లో దంపతుల హనీట్రాప్ బాగోతం వెలుగులోకి

కరీంనగర్‌లో దంపతుల హనీట్రాప్ బాగోతం వెలుగులోకి

43
0
  • ఇన్‌స్టాగ్రామ్ వలలో పడేసి న్యూడ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్
  • దంపతుల అరెస్ట్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 14:

కరీంనగర్‌లో హనీట్రాప్ పేరుతో దంపతులు చేసిన బ్లాక్‌మెయిల్ వ్యవహారం బట్టబయలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన ఫోటోలు పోస్టు చేస్తూ యువకులు, వ్యాపారులను వలలోకి లాగి, అనంతరం న్యూడ్ వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేసిన దంపతులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు గతంలో మార్బుల్ వ్యాపారం చేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం వీరిద్దరూ కరీంనగర్ నగరంలోని ఆరెపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటోలు అప్‌లోడ్ చేసి యువకులు, వ్యాపారులను ఆకర్షించిన ఈ దంపతులు, వారిని ఇంటికి పిలిపించి సన్నిహిత వీడియోలు చిత్రీకరించారు. అనంతరం ఆ వీడియోలను చూపించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. ఇప్పటివరకు సుమారు వందమందిని ఈ విధంగా మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఓ బాధితుడు ఇప్పటికే ఈ దంపతులకు రూ.12 లక్షలు చెల్లించగా, మరో రూ.5 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులతో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయడంతో పాటు కారు కొనుగోలు చేసి లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారి మొబైల్ ఫోన్లలో అనేక మంది బాధితుల న్యూడ్ వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.