- పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 6:
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధికి అసలు అర్థం ఉంటుందని, సమగ్ర గ్రామాభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్, రామకృష్ణ కాలనీ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, వారి సమస్యలు విని పరిష్కారాలపై దృష్టి సారించారు. సర్పంచ్ అభ్యర్థులతో కలిసి పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
“బీఆర్ఎస్ పాలనలో గ్రామాలు నిర్లక్ష్యం”
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. పంచాయతీలు ఖాళీ బాక్సుల్లా మారాయి. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు, మౌలిక వసతులు అన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయి అని తెలిపారు.
“కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధికి కొత్త ఊపు”
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల అభివృద్ధి మా మొదటి ప్రాధాన్యతగా మారింది. అవసరాలను గుర్తించి కొత్త పనులు మంజూరు చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి అసంపూర్తి పనులున్నా వాటిని పూర్తి చేయిస్తున్నాం. ఇదే మా ప్రభుత్వ ధోరణి అని పేర్కొన్నారు.
“సర్పంచ్ – వార్డ్ సభ్యులుగా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి”
అభివృద్ధి కొనసాగాలంటే గ్రామస్థులు కాంగ్రెస్ మద్దతుదారులను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. సర్పంచ్‌గా గెలిచే వారికి నేను వ్యక్తిగతంగా తోడ్పాటు అందిస్తా. గ్రామాలకు కావాల్సిన నిధులు, పథకాలు తీసుకురావడంలో పూర్తి సహకారం అందిస్తా అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మహాత్మానగర్ సర్పంచ్ అభ్యర్థి భైరి చంద్రమౌళి, రామకృష్ణ కాలనీ సర్పంచ్ అభ్యర్థి దావు సుజాత – సంపత్ రెడ్డి, 8వ వార్డు అభ్యర్థి మాచర్ల అంజయ్య, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు కుంట రాజేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు అలువాల కుమార్, కాంగ్రెస్ నాయకులు కేతిరెడ్డి ఎల్లారెడ్డి, దుర్గాప్రసాద్, గూడ కమలాకర్, ఈగ లింగయ్య, అంకూసు, సోమయ్యగారి అశోక్, కేతిరెడ్డి ప్రభాకర్, లింగారెడ్డి, బి. శ్రావణ్, చందా చంద్రశేఖర్, సుధాకర్, ప్రభాకర్ రాజు, రజనీ, రమ, బూతం అనిల్, తూర్పాటి శ్రీనివాస్, రామారావు తదితరులు పాల్గొన్నారు.








