Home agriculture రైతులకు అండగా నిలవాలి

రైతులకు అండగా నిలవాలి

13
0
  • మార్కెట్ కమిటీకి మంత్రి పొన్నం సూచన కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 9:

కరీంనగర్ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎల్లవేళలా అండగా నిలవాలి. వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ మార్కెట్ కమిటీకి మంచి పేరు తీసుకురావాలి అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
శనివారం కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇటీవల నియమితులైన ఆకుల నరసయ్య వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరసయ్యకు వారు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆకుల నరసయ్య కూడా మంత్రి, విప్‌లను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ విజయరమణారావు మాట్లాడుతూ.. మార్కెట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత కొత్త పాలకవర్గంపై ఉందన్నారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు రైతులకు అందేలా చూడాలని కోరారు. కరీంనగర్ మార్కెట్ కమిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్సీ టి. సంతోష్ కుమార్ను కూడా ఆకుల నరసయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. సంతోష్ కుమార్ ఆయనకు అభినందనలు తెలిపి, రైతు సేవలో ముందుండాలని ఆకాంక్షించారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.