Home తెలంగాణ భద్రాచలంలో జోరుగా మద్యం దందా !

భద్రాచలంలో జోరుగా మద్యం దందా !

13
0
  • బెల్ట్ షాపులు ఫుల్ -అధికారుల చర్యలు నిల్
  • మూడు కోటర్లు ఆరు ఫుల్లులుగా
    బెల్టు జోరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మే 5:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పుణ్యక్షేత్రమైన భద్రాచలం లో మద్యం దందా జోరుగా కొనసాగుతోంది.
పుట్టగొడుగుల్లా వెలసిన బెల్ట్ షాపులు ఫుల్లుగా కొనసాగుతన్నా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి .

మూడు కోటర్లు లు ఆరు పుల్లులు గా సాగుతున్న బెల్టు దందా

గల్లీ గల్లీ కి వెలసిన బెల్ట్ షాపులతో మూడు కోటర్లు ఆరు ఫుల్ బాటిళ్ల లాగా ఈ మద్యం దందా కొనసాగుతుంది. ఎమ్మార్పీ రేటు కంటే అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులు బెల్టు బాబులు గుల్ల చేస్తున్నారు.

ఎక్కడపడితే అక్కడ వెలిసిన బెల్ట్ షాపుల్లో ఎనీ టైం మద్యం అందుబాటులో ఉండడంతో మందుకి బానిసలైన కొందరు మద్యం మత్తులో మునిగితేలుతూ
సంపాదించిన సొమ్ము పోగొట్టుకోవడంతోపాటు అనారోగ్యం తో ఆసుపత్రుల పాలవుతున్నారు.
యువత సైతం మద్యానికి బానిసలై తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

ఒకప్పుడు వైన్ షాపులకు బార్ షాపులకు వెళ్లాలంటేనే భయపడే యువత బెల్ట్ షాపులలో అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉండడంతో విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ మద్యం మత్తులో గొడవలు సృష్టిస్తూ ప్రజాజీవనానికి భంగం కలిగిస్తున్నారు.

ఇదిలా ఉండగా పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో గిరిజన మ్యూజియం కి, గుడికి దాదాపు 100 అడుగుల దూరంలోనే వైన్ షాపు, బెల్టు షాపులకు సప్లై చేసే షాపు ఉండడం, ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. మరి
అధికారులు ఎంతవరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.