Home తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు పొందిన రవిచంద్రకు జీ.వి. శ్యాం ప్రసాద్ లాల్ అభినందనలు

గద్దర్ ఫిలిం అవార్డు పొందిన రవిచంద్రకు జీ.వి. శ్యాం ప్రసాద్ లాల్ అభినందనలు

22
0

కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 7:

ప్రముఖ కవి, సినీ విమర్శకుడు పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిలిం అవార్డు రావడం పట్ల నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ జీ.వి. శ్యాం ప్రసాద్ లాల్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన “ది ఫస్ట్ యాక్షన్ హీరో” అనే డాక్యుమెంటరీ ఒక గొప్ప లఘు చిత్రమని పేర్కొన్నారు.
రవిచంద్ర ఇటీవల విడుదల చేసిన “తెలంగాణ సినీ ప్రస్థానం” అనే పుస్తకం కూడా సినీ చరిత్రకు విలువైన కృషిగా నిలుస్తుందని తెలిపారు.
ఎస్‌పీఎఫ్ ట్రస్ట్ తరఫున కరీంనగర్ సమన్వయకర్త గోనె శ్రీనివాస్, కఫిసో కార్యవర్గ సభ్యులు రాచకొండ చక్రధర్ రావు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందిల్ల శంకర్ కూడా రవిచంద్రకు అభినందనలు తెలియజేశారు.
సినీ పరిశ్రమలో విమర్శకుడిగా, రచయితగా రవిచంద్ర చేస్తున్న సేవలు విశేషమని వారు కొనియాడారు.