Home Uncategorized కమర్షియల్ సిలిండర్ల సరఫరా బంద్

కమర్షియల్ సిలిండర్ల సరఫరా బంద్

20
0
  • బాలాపూర్ మండలంలో హోటళ్ళు
    అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 4: బాలాపూర్ చౌరస్తాలో గల హరినారాయణ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను బందు చేశారు. ఏజెన్సీలో 40 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని హోటల్లో రెస్టారెంట్లు వంటి వ్యాపార సంస్థలకు కమర్షియల్ గ్యాస్ ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని కేవలం అనాధాశ్రమాలు వృద్ధాశ్రమాలకు మాత్రమే సరఫరా చేయాలని నిర్వాహకులు తెలిపారు. మూతపడుతున్న హోటళ్ళు శంషాబాద్ జోన్ లోని బడంగ్ పేట, అల్మాస్గూడ, మీర్ పేట, చంపాపేట్, ప్రాంతాలలో అనేక హోటలు ఇప్పటికే మూతపడ్డాయి కమర్షియల్ సిలిండర్ కొరతతో హోటల్లు టీ షాపులు కర్రీ పాయింట్లు మెసులు మూతపడుతున్నాయి కొన్ని ఓట్ల వారు వంటకాలను తగ్గించడంతో పాటు అధిక ధరకు ఇక్కడ ఇస్తున్నారు సిలిండర్ల కొరత ఇలాగే ఉంటే ఓటర్లు శాశ్వతంగా మూసివేయవలసి వస్తుందని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ పశ్చిమ ఆసియా లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. యుద్ధాన్ని కంటే ముందు 1,900 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు 200400కు పెంచింది బ్లాక్ లో 6 వేలకు విక్రయిస్తున్నారు అంత ధర పెట్టి కొనలేని కొందరు అక్రమ మార్గంలో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి కమర్షియల్ సిలిండర్లలోకి, నింపి వినియోగిస్తున్నారు ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్ లోకి గ్యాస్ నింపడానికి వినియోగించే గ్యాస్ రీఫిల్ నాజల్ ధర గతంలో 150 200 ఉంటే ప్రస్తుతం వాటిని 450 నుండి 500 కు విక్రయిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పాతబస్తి నుండి కొందరు బాలాపూర్ బడంగ్ పేట మీర్పేట జిల్లాలో కూడా వంటి ప్రాంతాలకు వచ్చి కమర్షియల్ సిలిండర్లను ఐదువేల నుంచి 6000 రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా 35 రూపాయలు ఉన్న టిఫిన్స్, కొన్నిచోట్ల 45 కొన్ని ప్రాంతాలలో 40 రూపాయలకు మరికొన్ని ప్రాంతాల్లో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు ప్రజలు అంటున్నారు. బిర్యాని సెంటర్లు రెస్టారెంట్ల నిర్వహకులు కట్టెల పొయ్యిలు వాడుతున్నారు.