- గోల్డెన్ అవర్ రెస్పాన్స్ శిక్షణ
- డ్రైవర్లు, ప్రజలకు సూచనలు
కల్లూరు, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 17:
‘అరైవ్ ఆలైవ్’ కార్యక్రమం భాగంగా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆధ్వర్యంలో వియం బంజర పోలీస్ స్టేషన్ పరిధిలో గోల్డెన్ అవర్ రెస్పాన్స్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే విధానాలపై అవగాహన కల్పించారు.
వైద్య బృందం సమక్షంలో సీపీఆర్ (CPR), ప్రథమ చికిత్స, అత్యవసర కాల్స్ నిర్వహణ, పీఎం రహత్ నగదు ప్రోత్సాహం, సామాజిక బాధ్యత, గోల్డెన్ అవర్ రెస్పాన్స్ టైమ్ ప్రాముఖ్యత వంటి అంశాలపై వివరించారు.
ట్రాఫిక్ నియమాలపై దృష్టి
రహదారి భద్రతలో భాగంగా హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపకూడదని, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని డ్రైవర్లు, ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఆర్‌ఐ, ఎస్సై వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.


