Home ఖమ్మం అదే భూమిలో ఇళ్ళు కట్టించి ఇవ్వండి

అదే భూమిలో ఇళ్ళు కట్టించి ఇవ్వండి

23
0
  • బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డికి వినతి పత్రం

ఖమ్మం కలెక్టరేట్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 27:

ఖమ్మం జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ కమిటీ జిల్లా కన్వీనర్ ములకలపల్లి సంగమేశ్వర రావు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డికి వినతి పత్రం అందజేశారు . వెలుగుమట్ల భూదాన్ ట్రస్ట్ బోర్డు ప్రొసీడింగ్స్ ఆధారంగా 147, 148,149 సర్వే నంబర్లు గల భూమిలో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న పేదల ఇండ్లను కూల్చివేసి వారిని నిలవ నీడ లేకుండా చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని బిసి ఎస్సీ ఎస్టీ జేఏసీ భావిస్తుందని అన్నారు . అర్హులైన పేదలందరికీ భూదాన ట్రస్ట్ ఇచ్చిన భూమి భూమిలోనే ప్రభుత్వం తక్షణమే ఇల్లు కట్టించి ఇవ్వాలని గత 12 సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని ఉంటున్న సుమారు 1895 మందికి ఇండ్ల కూల్చివేత సమయంలో జరిగిన ఆస్తి నష్టానికి విలువ కట్టి వారికి నగదు రూపంలో చెల్లించి న్యాయం చేయాలని కోరారు . నిలువ నీడ లేకుండా ఇండ్లు కోల్పోయిన వారందరికీ ఇల్లు నిర్మించే వరకు పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే వారికి అన్ని ఖర్చులు భరించాలని పరీక్షల సమయంలో ఎంతో భవిష్యత్తు ఉన్న వారి పిల్లలకి వసతి భవనాలలో ట్యూటర్స్ ని పెట్టి పిల్లలకి చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు . పేదల పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతనే తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పొడకంటి రాంబాబు , రాష్ట్ర బాధ్యులు లింగన్న బోయిన లక్ష్మణ్ ముదిరాజ్ , కొర్లపాటి రాఘవులు , జిల్లా కో కన్వీనర్ కటకం వెంకటలక్ష్మి , జిల్లా కమిటీ సభ్యులు నాశ బోయిన నరేష్ ముదిరాజ్ , పంది రమేష్ , కన్నెగంటి రామాచారి తదితరులు పాల్గొన్నారు . దీనికంటే ముందు నిరాసితులైన బాధితులను అంబేద్కర్ భవన్ వద్ద వారిని కలిసి అర్హులైన వారందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఖమ్మం జిల్లా కమిటీ అండగా ఉంటుందని సంఘీభావం తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు . ప్రజాస్వామ్యబద్ధంగా చేసే న్యాయమైన పోరాటానికి రాజ్యాంగబద్ధంగా మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు .