Home agriculture వ్యవసాయ విద్యా దినోత్సవ వేడుకలు

వ్యవసాయ విద్యా దినోత్సవ వేడుకలు

20
0
  • ఘనంగా వ్యవసాయ కళాశాలలో జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం

అశ్వారావుపేట, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 3:

అశ్వారావుపేట మండలం కేంద్రంలో వ్యవసాయ కళాశాల లో జాతీయ వ్యవసాయ విద్యా దినోత్సవం (నేషనల్ Agricultural ఎడ్యుకేషన్ డే) ఘనంగా నిర్వహించారు. భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి మరియు కేంద్ర వ్యవసాయ మంత్రిగా సేవలందించిన డా. రాజేంద్ర ప్రసాద్ జయంతిని జరుపుకుంటారు. రాష్టం లోనే వ్యవసాయ మరియు ఉద్యానవన పంటల సమ్మేళనంతో ఖ్యాతిని గడించిన అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల వ్యవసాయ రంగం లో తనదైన ముద్ర వేసిందని కళాశాల అసోసియేట్ డీన్ డా. హేమంత కుమార్ పేర్కొన్నారు. అశ్వారావుపేటలో గల వివిధ పాఠశాల లోనుంచి విద్యార్థులు కళాశాలకు క్షేత్ర పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు వ్యవసాయానికి సంబంధించిన నమూనాలు తయారుచేసి పాఠశాల విద్యార్ధులకి ప్రదర్శించారు. వ్యవసాయంలో జరిగే మార్పులు, ఆధునీకరణ, మట్టి పరీక్షలు, యాంత్రీకరణ, ఉద్యానవన మొక్కలు, సాంకేతికత మొదలగు విషయాల పై కళాశాల విద్యార్థులు ప్రదర్శన లో చర్చించారు. ఈ కార్యక్రమంలో డా. ఐ.వి.ఎస్. రెడ్డి, డా. రాంప్రసాద్, డా. నాగాంజలి, డా. నీలిమ, డా. కృష్ణ తేజ, డా. దీపక్ రెడ్డి, డా. శ్రావిక, హిమశ్రీ, చందన, పావని కళ్యాణి, సాయి దుర్గ, కమల మొదలగు అధ్యాపకులు పాల్గొన్నారు.