Home agriculture *వడ్లు, మక్కల కొనుగోళ్లలో జాప్యం రైతులకు శాపంగా మారింది

*వడ్లు, మక్కల కొనుగోళ్లలో జాప్యం రైతులకు శాపంగా మారింది

19
0
  • బీజేపీ ఆగ్రహ ధర్నా కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 22:

కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు, మక్కల కొనుగోళ్లు తీవ్ర జాప్యానికి గురవుతూ రైతులు పడుతున్న ఇబ్బందులను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్నలు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉండిపోవడంతో వర్షాలకు తడిసి నాణ్యత కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, రైతు పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూ తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా మరియు ఏఓ రాజు గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.