- అందమైన సరూర్నగర్ చెరువును మురికి కూపం చేశారు
- బడంగ్ పేట భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు రామిడి రామిరెడ్డి
రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 21:
గత 10 సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ చెరువును శుద్ధి చేసి సుందరీకరణతో పాటు పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని బడంగ్ పేట తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు రామిడి రామిరెడ్డి ఆరోపించారు. కెసిఆర్ హయాంలో సుందరీకరణతో పాటు పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటే నేడు అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం సరూర్నగర్ చెరువును ఒక మురికి కూపంగా మార్చి వేసిందని ఎద్దేవా చేశారు. కమిషన్లు రియల్ ఎస్టేట్ లు, దండాలు తప్ప పాలను చేతకాని కాంగ్రెస్ దొంగల నిర్లక్ష్యం వల్ల ఎవరూ పట్టించుకోకుండా చెత్తాచెదారంతో నిండిపోయి కాంగ్రెస్ నాయకుల నోరుల లాగానే పూర్తిగా కంపు కొడుతున్నాయని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనానికి నిర్లక్ష్యానికి నిదర్శనం అని ప్రశ్నించారు.








