Home క్రైమ్ చిట్యాల హైవేపై కత్తిపోటు కలకలం !

చిట్యాల హైవేపై కత్తిపోటు కలకలం !

21
0
  • లిఫ్ట్ అడిగిన గుర్తు తెలియని వ్యక్తి
  • డ్రైవర్‌పై ఆకస్మిక దాడి

నల్లగొండ / చిట్యాల, ఆర్గాన్ న్యూస్:

నల్లగొండ జిల్లాలోని చిట్యాల నేషనల్ హైవేపై సంచలన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ నుంచి హైదరాబాద్‌కు కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ ఇమ్రాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.
వివరాల ప్రకారం… నార్కెట్‌పల్లి సమీపంలో లిఫ్ట్ అడిగిన యూపీ–బీహార్ ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న దుండగుడు కారులో ఎక్కాడు. చిట్యాల సమీపానికి చేరుకున్న తర్వాత, డ్రైవర్‌పై ఆకస్మికంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
డ్రైవర్ వద్ద ఉన్న మొబైల్‌ను లాక్కునే ప్రయత్నం చేయగా, ఇమ్రాన్ ప్రతిఘటించడంతో దుండగుడు కత్తితో తీవ్రంగా గాయపరిచినట్టు సమాచారం. ఈ దాడిలో డ్రైవర్‌కు తీవ్ర రక్తస్రావం కాగా, పరిస్థితి విషమంగా మారింది.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో, 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన డ్రైవర్‌ను నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది.
సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన దుండగుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో నేషనల్ హైవేపై ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.