Home ఎడిటోరయిల్‌, ఆర్గాన్ న్యూస్ “ఉప్పు ముప్పు” తగ్గిద్దాం

“ఉప్పు ముప్పు” తగ్గిద్దాం

5
0
  • అడ్డగోలుగా వాడుతున్న భారతీయులు ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి, రంగారెడ్డి: వంటల్లో అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు, ఉప్పు నాలుకకు రుచి తగలాలి అంటే ఉప్పు ఉండాల్సిందే కానీ ఆ ఉప్పు ముప్పుగా మారిందని నిశ్శబ్ద మహమ్మారికి ఊపిరి పోస్తుందని ఐ సి ఎం ఆర్ ( భారత వైద్య పరిశోధనా మండలికి) చెందిన ఎఫిడెమియాలజి (ఎన్ఐఈ ) నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తి రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలని కానీ భారతదేశంలోని పట్టణ ప్రాంతాలలో సగటున 92 గ్రాములు గ్రామీణ ప్రాంతాలలో 5.6 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇలా పరిమితికి మించి ఉప్పు వినియోగంతో అధిక రక్తపోటు గుండె మూత్రపిండాల సంబంధిత సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఐపిఎంఆర్ ఎన్ఐఈ నిపుణులు తెలంగాణ పంజాబ్ రాష్ట్రాలలో మూడు సంవత్సరాలు అధ్యయనం చేపట్టారు. చిన్న మార్పుతో పెద్ద ప్రయోజనం ఉప్పు వినియోగం ప్రత్యామ్నాయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్ఐఈ పించ్ ఫర్ చేంజ్ అనే నినాదంతో ప్రచారం చేస్తుంది. ఉప్పు విషయంలో ఒక చిన్న మార్పుతో పెద్ద ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ” మేము ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలోని ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పని చేస్తున్నాం ఉప్పు వినియోగం తగ్గించే అంశంపై ” అందరికీ తగిన అవగాహన కల్పించేలా వారికి కౌన్సిలింగ్ పద్ధతులు వివరిస్తున్నాం. ప్రజలను మంచి వైపుకు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. మా ప్రతినిధి హప్సిగూడలోని ఐ సి ఎం ఆర్ నిపుణులను కలిసినప్పుడు వారు ఈ విషయాలు వెల్లడించారు ప్రజలకు ఉప్పు వినియోగంపై అవగాహన కల్పించేలా వారికి కౌన్సిలింగ్ పద్ధతులు వివరిస్తున్నాం. ప్రజలను మంచి వైపుకు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. ఉప్పు వాడకాన్ని తగ్గించడంలో కౌన్సిలింగ్ ప్రభావం పై అంకెనా వేస్తున్నాం అని తెలిపారు సోడియం తక్కువగా ఉండే ఉప్పును వినియోగిస్తే రక్తపోటు సగటున 7/4 ఎమ్ ఎమ్ హెచ్ జి మేర తగ్గుతుంది అన్నారు. ఉప్పు( సోడియం క్లోరైడ్) లోని సోడియం మనలో రక్తపు పోటును పెంచుతుంది. ఉప్పులో కొంత సోడియం తగ్గించి రుచిలో మార్పు రాకుండా ఆమె రా పొటాషియం లేదా మెగ్నీషియం లవణాలను కలిపిన ఉప్పును వినియోగించుకోవచ్చని తెలిపారు. తక్కువ సోడియం ఉప్పు లభ్యత ధరతో సమస్య సోడియం తక్కువగా ఉన్న ఉప్పులభ్యత ధర విషయంలో సమస్య తలెత్తుతుంది. చెన్నైలోని 300 రిటైల్ దుకాణాల్లో పరిశీలన చేపట్టగా 28% రిటైల్ దుకాణాలలో మాత్రమే లభిస్తుందని ఐసి ఎంఆర్ నిపుణులు తెలిపారు . ఎక్కువ మంది ప్రజలు ఆశ్రయించే చిన్న కిరాణా దుకాణాలలో నాలుగు శాతం దుకాణాలలో మాత్రమే ఈ ఉప్పు అందుబాటులో ఉంది అని ఇక తక్కువ సోడియం ఉన్న ఉప్పు రేటు ఎక్కువగా ఉండడం సమస్యగా మారిందని 100 గ్రాముల సామాన్య ఉప్పు ధర 2.7 ఉంటే సోడియం తక్కువగా ఉన్న ఉప్పు ధర 5.6 ఉన్నట్లు తమ పరిశోధనలో తెలిసిందని వారు తెలిపారు.