కర్మయోగి, కార్యదీక్షా పరుడు, తత్వవేత్త, రాజనీతి కోవిదుడు ఆయనే ఆచార్య చాణక్య
బ్రాహ్మణ కార్పొరేషన్ సాధన సమితి చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్, రుద్రవీణ బాలసుబ్రమణ్యం రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 6: ఆచార్య చాణిక్యుడు చూపిన మార్గం నేటి మార్గదర్శక దీపస్తంభమని బ్రాహ్మణ కార్పొరేషన్ సాధన సమితి చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ రుద్రవీణ బాలసుబ్రమణ్యం అన్నారు. సోమవారం నాడు ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ సమాజంలో ఈరోజు జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా ఆవేదన కలుగుతుందని విచారం వ్యక్తం చేశారు. సమాజంలో విలువలు క్షీణిస్తున్న ఈ కాలంలో ధర్మబద్ధమైన ఆలోచనలతో కూడిన దృఢమైన కార్యాచరణ అత్యవసరమని అటువంటి సమగ్ర దృష్టిని మనకు అందించిన మహా మేధావి ఆచార్య చాణుక్యుడని గుర్తు చేశారు. చాణిక్యుడు కేవలం ఒక రాజనీతి శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదని ఆయన ఒక సమాజ శిల్పి వ్యక్తి నుంచి రాజ్యం వరకు ప్రతి స్థాయిలో ధర్మాన్ని ఆధారం చేసుకుని వ్యవస్థను నిర్మించాలని లక్ష్యం ఆయనకు ఉండేదని అన్నారు. ఆయన రచించిన అర్థశాస్త్రం, పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, భద్రత, విద్యా,న్యాయం, ఇలా ప్రతి అంశాన్ని స్పృశిస్తుందని కర్మయోగి, కర్మమే పరమధర్మం చాణుక్యుని దృష్టిలో వ్యక్తి తన కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయాలని అది వ్యక్తిగత జీవితాన్నించే ప్రజాసేవ వరకు వర్తించే సూత్రమని నేటి కాలంలో బాధ్యత లేకుండా హక్కుల కోరే ప్రవృత్తిని తగ్గించాలంటే ఈ కర్మయోగ భావనను ఆచరణలోకి తేవాలని కోరారు. కార్యదీక్ష సంకల్పమే విజయానికి మూలం చాణక్యుడు సాధారణ గురువు నుండి మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యూహకర్తగా గా ఎదిగాడు. అతని విజయానికి మూలం అచించలమైన సంకల్పమని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక అడ్డంకులు వచ్చిన వెనకడుగు వేయకుండా ముందుకు సాగడం అదే కార్యదీక్ష అని ఇది యువతకు అత్యవసరమైన జీవన విలువ అని పేర్కొన్నారు. చాణిక్యని ఆలోచనలు ఒక గంభీరథ ఉందని అతను పరిస్థితులను పైపైగా చూడలేదని మూల కారణాలను అర్థం చేసుకున్నాడని సమస్యకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం చేసిన ప్రయత్నం విజయవంతం అయ్యిందని, ఇది నేటి పాలనలో విధాన రూపకల్పనలో చాలా అవసరమని చాణిక్యని వ్యూహాలు చాలా ప్రగాఢమైన, సమయం, స్థలం, పరిస్థితి, వీటిని పట్టి నిర్ణయాలు తీసుకోవాలి కానీ అదే సమయంలో ధర్మాన్ని ఎప్పుడూ విడవకూడదని ఇది వ్యూహాత్మకమైన, నైతికథ అనే గొప్ప భావన అని అన్నారు ఈ రోజులలో చాణిక్యని ఆలోచనలను నాయకత్వంలో నైతికత అధికారంలో ఉన్నవారు స్వార్ధాన్ని కాదు ప్రజాహితానికి ముందు ఉండాలని విద్యలో విలువలు పాఠ్యాంశంతో పాటు నైతిక విద్యా ధర్మ బోధన అవసరమని ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత సంపద సృష్టి సమాన పంపిణీ స్థిర సమాజం, న్యాయవ్యవస్థలో దృఢత్వం, ధర్మాన్ని కాపాడే శక్తి ఉన్నప్పుడు మాత్రమే సమాజం నిలుస్తుందని పేర్కొన్నారు. వ్యక్తిలో క్రమశిక్షణ స్వీయ నియంత్రణ లేకుండా ఎటువంటి సమాజం అభివృద్ధి చెందదని, చాణిక్యుని బోధనలు ఒక వర్గానికి పరిమితం కాలేదని అవి సమస్త మానవ సమాజానికి వర్తించే సార్వత్రిక సత్యాలు కాబట్టి ఈ సిద్ధాంతాలను వర్గాల పరిమితిలో కాకుండా సమాజ శ్రేయస్సు దృష్టిలో చూడాలని పేర్కొన్నారు. ఇప్పటి పరిస్థితులలో మనకు కావలసినది ఆలోచనలో చాణిక్యుడు, ఆచరణలో కర్మయోగి, నిర్ణయంలో ధర్మబద్ధత, ఉండాలని చాణిక్యని వ్యూహాలను మళ్లీ జీవితంలోకి తీసుకురావాలి కానీ అవి కేవలం గ్రంథాలలో ఉండకూడదని ప్రతి వ్యక్తి ఆచరణలో ప్రతిబింబించాలని ధర్మం లేకుండా వ్యూహం ప్రమాదకరమని వ్యూహం లేకుండా ధర్మం బలహీనమని ఈ రెండింటిని సమన్వయం చేసిన మహానుభావుడు ఆయన అని పొగిడారు. అందుకే ధర్మాన్ని ఆధారంగా చేసుకున్న వ్యూహాలతో సమాజాన్ని మళ్లీ నిర్మించాలని, ఆ ఆలోచనతోనే బ్రాహ్మణ కార్పొరేషన్ సాధన కొరకు యావత్ బ్రాహ్మణ జాతి కృషి చేయాలని రుద్రవీణ బాలసుబ్రమణ్యం కోరారు.