Home POLITICS ఖమ్మం సుడా చైర్మన్‌గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ నియామకం

ఖమ్మం సుడా చైర్మన్‌గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ నియామకం

11
0
  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మహమ్మద్ ఖాదర్ అలీ నియామకం
  • రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ – కాంగ్రెస్ వర్గాల్లో హర్షం

ఖమ్మం, ఆర్గాన్ న్యూస్:

ఖమ్మం జిల్లా స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్‌గా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రత్యేక జీవో జారీ చేసింది.

వైరాకు చెందిన దుర్గాప్రసాద్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సన్నిహిత అనుచరుడిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఆయన ఎన్నో సంవత్సరాలుగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు.

అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా మహమ్మద్ ఖాదర్ అలీ (ఖాదర్ బాబా) నియమితులయ్యారు. పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవి లభించింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో దుర్గాప్రసాద్ పార్టీ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఏడు సంవత్సరాల పాటు డీసీసీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు.

దుర్గాప్రసాద్ నియామకంపై కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.