Home agriculture నాగులవంచలో మొక్కజొన్న రైతుల రాస్తారోకో

నాగులవంచలో మొక్కజొన్న రైతుల రాస్తారోకో

13
0
  • రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభనం
  • భారీగా నిలిచిన వాహనాలు

ఆర్గాన్ న్యూస్, బోనకల్, మే 4:

నాగులవంచలో మొక్కజొన్న రైతుల ఆందోళన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించింది. రైతులు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఈ కార్యక్రమాన్ని సీపీఎం నాయకులు నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వర్లు, మడుపల్లి గోపాలరావు, వత్సవాయి జానకిరాములు, కొండ్రు జానకిరామయ్య, ఆలస్యం రవి, తోటకూరి వెంకటనరసయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు మంకెన రమేష్, గురజాల హనుమంతరావు, వంకాయలపాటి లచ్చయ్య, కోపూరి నవీన్, నారపోగు నాగయ్య ఆధ్వర్యంలో చేపట్టారు.
వైరా సీఐ వెంకటకృష్ణ నేతృత్వంలో చింతకాని పోలీసులు భారీగా మోహరించినప్పటికీ, రైతులు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. కాటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను వెంటనే లారీల ద్వారా గోదాములకు తరలించాలని, ఎకరాకు 26.05 క్వింటాళ్ల పరిమితి లేకుండా మొత్తం పంటను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు కదలబోమని రైతులు పట్టుబట్టారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా స్పందించి, రెండు రోజుల్లో లారీలు పంపించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ హామీతో రైతులు రాస్తారోకో విరమించగా, ట్రాఫిక్ సమస్యలు సద్దుమణిగాయి. కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.