- మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్ డిసెంబర్ 3: మీర్ పేట కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ క్లస్టర్ 1,2, అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి, తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, ఆదివారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళపై మాట్లాడిన తీరుకు నిరసనగా, బుధవారం నాడు మీర్ పేట చౌరస్తా వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దద్దం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పసునూరి బిక్షపతి చారి, తులసి ముఖేష్ ముదిరాజ్ మాట్లాడుతూ హిందువులకు సంబంధించిన దేవీ దేవతలను అవహేళన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడిన మాటలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒక హిందువుగా ఉంటూ హిందూ దేవతల మీద రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడా ఓట్ల కోసం దిగజారి కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారని బహుశా ఎంఐఎం సహవాస దోషము వల్లనే రేవంత్ రెడ్డి హిందువుల మీద హిందూదేవీ దేవతల మీద బరితెగించి మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణలో కూడా హిందువులంతా ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని హిందువుల శక్తి ఏమిటో రేవంత్ రెడ్డికి యావత్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేయవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఏ ఓట్లతో అయితే అధికార పీఠం ఎక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారో ఆ ఓట్లతోనే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి పట్టిన మైకాన్ని అహంకారాన్ని వదిలిస్తామని అధికార పీఠం నుంచి దించేస్తామని అందుకు తెలంగాణలోని హిందువులంతా ఏకం కావాలని రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పేంతవరకు ఈ పోరాటం ఆగదని సీఎం రేవంత్ రెడ్డి ఇంటినీ ముట్టడిస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిద్దాల శ్రీనివాస్, ఇంద్రావతి రవి నాయక్,జిల్లా కౌన్సిల్ సభ్యులు కోడూరు సోమేశ్వర్,గాజుల మధు, మాజీ కార్పొరేటర్లు ఏ భీమరాజు, కీసర కృష్ణారెడ్డి, స్థూల ప్రభాకర్, ఉపాధ్యక్షురాలు కుందన లత, శ్రీ హైందవి, రజిని,వరికుప్పల బుచ్చి రాములు,చిల్లంపల్లి రాజశేఖర్,బీజేవైఎం నాయకులు రాఘవేందర్ ముదిరాజ్,ప్రదీప్, మనీష్ ముదిరాజ్,మన్యం రవీందర్, రాఘవేందర్ గౌడ్,నిఖిల్ సింగ్, ప్రమోద్,ఆవుల సత్తయ్య, కృష్ణారెడ్డి, ప్రభాకర్ చారి, శ్రీనివాస్ చారి,మురళీ చారి, శ్రీనివాస్ రెడ్డి, జయకాంత్, నితిన్,జెడి పవన్,భరత్,కిట్టు, శంకర్,పాల్గొన్నారు.


