- తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్
రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 1:
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం గత రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఈ నెల డిసెంబర్ 3న హైద్రాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న సమాచార–పౌర సంబంధ శాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TUWJ) నిర్ణయించింది.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, జర్నలిస్టుల బృందాలు అనేకసార్లు శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ను కలిసి తమ సమస్యలు వివరించినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని TUWJ పేర్కొంది.
దీనికి నిరసనగా డిసెంబర్ 3న మాసబ్ ట్యాంక్‌లోని సమాచార-పౌర సంబంధ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపింది.
TUWJ అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ వెల్లడించిన డిమాండ్లు:
అక్రిడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించాలి
ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలి
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు మంజూరు చేయాలి
వృత్తి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి
సంక్షోభంలో ఉన్న చిన్న పత్రికలకు ఆర్థిక సాయం అందించాలని
ప్రకటనపై ఇద్దరు నేతలు సంతకాలు చేశారు.


