Home ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ పనిచేయక ఇబ్బందులు

ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ పనిచేయక ఇబ్బందులు

16
0
  • పార్ధివ దేహాలతో పేదల అవస్థలు
  • జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

ఖమ్మం, ఆర్గాన్ న్యూస్ ఏప్రిల్ 17:

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ సదుపాయం పనిచేయకపోవడంతో చనిపోయిన వారి పార్ధివ దేహాలను భద్రపరచడంలో తీవ్ర సమస్యలు తలెత్తాయి. ఫ్రీజర్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు పార్ధివ దేహాలను బయట ఉంచుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
డబ్బులు ఉన్నవారు రూ.3,500 ఖర్చు చేసి ప్రైవేట్ ఫ్రీజర్ తెప్పించుకుని దేహాలను భద్రపరుచుకుంటుండగా, పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి నుంచి ఇప్పటివరకు మూడు పార్ధివ దేహాలతో కుటుంబాలు ఆసుపత్రి వద్దే ఆవేదనతో వేచి ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై బాధితులు ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఫ్రీజర్ సదుపాయాన్ని పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి మాటల్లో కాకుండా, మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.