Home తెలంగాణ తీన్మార్ మల్లన్న ఆఫీస్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

తీన్మార్ మల్లన్న ఆఫీస్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం

23
0

రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 5:

తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు ఒక యువకుడు గురువారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు జగద్గిరిగుట్టకు చెందిన సాయి ఈశ్వర్ (30) కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు గురువారం సాయంత్రం పీర్జాదిగూడలోని వరంగల్ హైవే పక్కన ఉన్న తీన్మార్ మల్లన్న కార్యాలయం వద్దకు వచ్చి మల్లన్నను కలవాలని ఆఫీసు సిబ్బందికి చెప్పాడు. మల్లన్న కార్యాలయంలో లేడని రేపు రమ్మని సిబ్బంది తిప్పి పంపారు దీనితో సాయి ఈశ్వర్ మెట్లపై నుంచి కిందికి వచ్చి పెట్రోల్ ఒంటి మీద పోసుకొని నిప్పుంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పారు అనంతరం అతడి ని ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసావు అని అడగగా బీసీ ఉద్యమం కోసం అనడం వినిపించిందని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న సాయి ఈశ్వర్ ని మేడిపల్లి పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న గాంధీ ఆసుపత్రికి వెళ్లినట్లు ఈశ్వర్ ని పరామర్శించినట్లు తెలిసింది.దీనిపై పోలీసులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.