Home Uncategorized సమగ్ర ఆర్థిక సర్వే నిర్వహించాలిశంషాబాద్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కే గణేష్,

సమగ్ర ఆర్థిక సర్వే నిర్వహించాలిశంషాబాద్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కే గణేష్,

4
0

రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్ ఏప్రిల్ 25.

ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక పెళ్లి చేయాలంటే ప్రణాళికలు ఎలా వేస్తాము నూతనంగా ఏర్పడిన దేశాభివృద్ధి కోసం వాస్తవిక దృష్టితో కూడిన బృహత్ ప్రణాళికలు కావాలని శంషాబాద్ జోన్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే గణేష్, పేర్కొన్నారు. శనివారం నాడు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ భారతదేశంలో అలా జరిగి ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావని అనేకమంది ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులను అవినీతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ సంపాదనకు మార్గాలు ఏర్పడ్డాయని పనులు చేయకుండానే బిల్లులు పాసులు చేయించుకోవడం రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కువ కావడంతో ప్రభుత్వ పథకాలు నీరు గారి పోతున్నాయని అన్నారు.

గరీబీ హటావో ఏమైంది?

ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదం కొంతవరకు ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కేంద్రం గ్రామాలకు విడుదల చేస్తున్న నిధులలో 90 శాతం మధ్యలోనే ఆవిరి అవుతున్నాయని సత్యాన్ని నాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ జవహర్ రాజు గారి యోజన కింద ఏకంగా ఢిల్లీ నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేశాడని గుర్తు చేశారు. ఈ విధంగా అనేక పేదరిక నిర్మూలన పథకాలతో 2017 వరకు వేలాది కోట్ల రూపాయలను గ్రామాల అభివృద్ధి సంక్షేమం కొరకు ఖర్చు చేస్తున్నప్పటికీ నిధులకు జరుగుతున్న అభివృద్ధికి పొంతన లేకుండా పోయిందని అన్నారు.

నాటి జనాభా లెక్కల ప్రకారం 1971 శిఖరంలో ప్రజలకు రేషన్ కార్డులు ఇచ్చారని ఆ తర్వాత ఒకటి రెండుసార్లు ఇచ్చినప్పటికీ ఊర్లో సర్పంచ్ చెబితే లేదా మరెవరో సిఫార్సు చేస్తే వచ్చినవే కానీ వీటి మీద సమగ్ర సర్వే లేదు అని అన్నారు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ బియ్యం గోధుమలు చక్కెర కొన్నిసార్లు ఉప్పు పప్పులు ఇస్తున్నారు ప్రధానమంత్రి గరీబి కళ్యాణ యోజన కింద ప్రస్తుతం 80 కోట్ల రేషన్ కార్డుదారులకు రేషన్ వస్తువులు అందుతున్నాయని పేర్కొన్నారు తెలంగాణలో ఈ సంఖ్య ఒక కోటి 80 లక్షలు గా ఉందని ఫుడ్ సెక్యూరిటీ అన్నపూర్ణ అంత్యోదయ అన్న యోజనా లాంటి అనేక పథకాల ద్వారా కోటానుకోట్ల రేషన్ ప్రజలకు అందుతుంది ఒక్క రేషన్ మాత్రమే కాదు ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు అయినా పెన్షన్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కళ్యాణ లక్ష్మి అన్నీ కూడా నాడు ఇచ్చిన రేషన్ కార్డుదారులకే అందుతుంటే కొత్త వారి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు పేదరికం పేరుతో దశాబ్దాలుగా లబ్ధి పొందుతున్న వీరిమధ్య సమగ్ర సర్వే అవసరమని అన్నారు.

ఎవరు నిజమైన పేదలు

గత నాలుగు దశాబ్దాలుగా వీరి జీవన విధానంలో మార్పు లేదా వీరిలో నిజంగానే అసలు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేని వారు ఇంకా ఉన్నారా అనేది సర్వే చేస్తే గాని తెలియదని గత 40 ఏళ్ల కాలంలో ప్రజల జీవన విధానంలో భారీ మార్పులు వచ్చాయని ఆర్థిక వ్యవస్థ బాగా పుంజుకుందని వ్యవసాయ పారిశ్రామిక రంగాలు నిర్మాణరంగం విస్తృతమైన స్థాయిలో పెరిగాయని కోట్లలో డబ్బులు చలామణి అవుతున్నాయని ఈ పరిస్థితులు దేశంలో మొత్తంలో కూడా సామాజిక ఆర్థిక సర్వే చేపట్టవలసిన అవసరం ఉంది ఎవరు పేదవారు కాదు ఎవరు పేదవారు అనే నిర్ధారణకు ప్రభుత్వం కచ్చితంగా రావలసిన అవసరం ఉంది అన్నారు నిజమైన పేదలకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందాలు కానీ పేదల పేరుతో దశాబ్దాలుగా ఇంకా పాత వారికే ఫలాలు అందించడం భావ్యం కాదు అన్నారు.