Home ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య

ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య

6
0
  • పిఎంశ్రీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామరాజు వెంకటరమణ రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 18: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన మెరుగైన విద్య అందుతుందని హిల్ కాలనీ లోని పి ఎం శ్రీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామరాజు వెంకటరమణ అన్నారు. నాగార్జునసాగర్ లో ఇంటింటికి బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెద్ద ఊర మండల విద్యాశాఖ అధికారి రాము ఆదేశాల మేరకు పాఠశాలలో ముందస్తు బడిబాట నిర్వహిస్తూ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకోవడానికి ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని, రామరాజు వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు . పీఎం శ్రీ పథకం ద్వారా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు కంప్యూటర్ బెల్టు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు శేషు సతీష్ కుమార్ వెంకన్న రేణుక సంధ్య పాఠశాల చైర్మన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.