- విచారణ పేరుతో కాలయాపన చేస్తున్న ఆర్సిఓ
- హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితులు…!
- యువజన సంఘాల నాయకులకు బెదిరింపులు..!
సూర్యాపేట ప్రతినిధి,ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్ 17 :
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓ గిరిజన పేరేంటు పై నోరు పారేసుకుని పత్రికలు రాయలేని బూతులు తిడుతూ అతనిని బెదిరింపులకు గురిచేసి భౌతిక దాడికి ప్రేరేపిస్తానని చెప్పిన విషయమై సంబంధిత విభాగానికి చెందిన అధికారులు నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు తెలిసింది గతి లేని పరిస్థితిలో సదరు గిరిజన పేరెంటు ఎన్ హెచ్ ఆర్ సి ని సంప్రదించగా సదరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై ఎటువంటి చర్యలు లేకుండా చేసేందుకు కొందరు యువజన సంఘాల నాయకులు అధికారులు కలిసికట్టుగా కృషి చేస్తున్నట్లు తెలిసింది
పూర్తి వివరాలలోకి వెళితే సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం సమీపంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఏప్రిల్ మొదటి వారంలో గిరిజన పేరెంటు ఒకరు తన కూతురును పాఠశాలలో దింపేందుకు రాగా ప్రధానోపాధ్యాయురాలు అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతూ భౌతిక దాడికి వెనకాడనని హెచ్చరించిన విషయం సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయురాలు పాఠాలు బోధించకుండా పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే తన మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఏప్రిల్ మొదటి వారంలో చివ్వెంల మండలానికి సంబంధించిన ఓ గిరిజన బాలికను ఆమె తండ్రి పాఠశాలలో పంపేందుకు రాగా మనుషులను పెట్టి దాడులకు పాల్పడతానని బెదిరించిన విషయం వెలుగులోకి వచ్చింది పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులను వాచ్ మెన్ ను చేతుల్లో పెట్టుకొని సదరు ప్రధానో పాధ్యాయురాలు దందాలు బెదిరింపులు పాల్పడుతున్న విషయం గురించి విచారణ నిర్వహించేందుకు వచ్చిన ఆర్సిఓ జాను నాయక్ సదరు ప్రధానోపాధ్యాయురాలు పై గుట్టు చప్పుడు కాకుండా విచారణ నిర్వహించి తాత్కాలికంగా నోటీసులు జారీ చేసి విషయాన్ని మరుగున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు వాస్తవానికి ఆ మండలంలో జరుగుతున్న జాతరకు స్థానికంగా సెలవుదినంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికిని అధికారులు పట్టించుకోకపోవడంతో గిరిజనులకు సెలవు దినంగా ప్రకటించలేదు అయినా సమీప పాఠశాలలో విద్యార్థులు మాత్రం తమ ఇష్ట దైవానికి జాతర నిర్వహిస్తుండడంతో ఇండ్లకు వెళ్లారు ఈ విషయంపై స్థానిక ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులను పాఠశాలల్లోకి తీసుకోకుండా వచ్చిన తల్లిదండ్రులపై పత్రికలో రాయలేని బూతులు మాట్లాడుతూ అగౌరవపరిచే మర్యాదగా ప్రవర్తించిన సంబంధిత ఆర్సిఓ గాని పోలీసులు గాని ఎటువంటి చర్యలు తీసుకొనట్లు తెలుస్తుంది
నోటీసులు ఇచ్చిన చర్యలు ఏవి…
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం గ్రామపంచాయతీ శివారులోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు అమాయకుడైన గిరిజన పేరుంటు పై నోరు పారేసుకుని విద్యార్థినినీ బయటికి పంపిస్తానని బెదిరించిన విషయమై ఆర్ సి ఓ జాను నాయక్ గుట్టు చప్పుడు కాకుండా విచారణ నిర్వహించి నోటీసు జారీ చేసినట్లు తెలుస్తుంది ఆ నోటీసులు సదరు ప్రధాన ఉపాధ్యాయులు చేసింది తప్పని తేలినప్పటికీ ఆమెపై చర్యలు తీసుకోకుండా ఆమె దగ్గర కొంత మామూల రూపంలో తీసుకొని విద్యార్థి యొక్క తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం ఈ విషయమై జిల్లా అధికారులు రాష్ట్రస్థాయి అధికారులు తనకు జరిగిన అన్యాయం పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించినట్లు తెలిసింది దీంతో సదరు ప్రధానోపాధ్యాయురాలు భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ తనకున్న సంబంధాలతో తన భార్యపై ఎటువంటి చర్యలు లేకుండా ఉండేందుకు కొందరు నాయకులతో బెదిరింపులకు పాల్పడుతూ అవసరమైతే సెటిల్మెంట్లు చేసుకుంటూ సమస్యను పక్కదోవ పట్టించినట్లు తెలుస్తుంది ఈ విషయంలోనే సంబందిత శాఖ రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి అధికారులకు సైతం మామూలు ముట్ట చెప్పడంతో గిరిజన పేరెంటుపై నోరు పారేసుకుని బెదిరింపులకు పాల్పడిన ప్రధానో పాధ్యాయురాలు పై ఎటువంటి చర్యలు లేకుండా చేసినట్లు తెలుస్తుంది తద్వారా ఒకవైపు విద్యాశాఖ పై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కోల్పోతుండగా భవిష్యత్తులో విద్యార్థుల తల్లిదండ్రులపై సదరు ఉపాధ్యాయురాలు మానసిక పరిస్థితి సక్రమంగా లేకుండా దాడులకు పాల్పడిన వారిపై ఇటువంటి చర్యలు తీసుకున్న ప్రభుత్వము పోలీసులు అధికారులు ఏమి చేసే అవకాశం లేనట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత బాధ్యత గల అధికారులు స్పందించి అకారణంగా గిరిజన పేరేంటు పై పత్రికలో రాయలేని బూతులు తిట్టి బెదిరింపులకు పాల్పడిన గిరిజన వ్యతిరేకైనా ప్రధానోపాధ్యాయురాలు పై కఠిన చర్యలు తీసుకుని ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా సదరు ఉద్యోగినికి సహకరిస్తున్న అధికారులు ఇతర నాయకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.


