నేడు ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలు అక్కినేపల్లి పురుషోత్తమరావు, ఆర్గాన్ న్యూస్ ప్రతినిధి, రంగారెడ్డి ఏప్రిల్ 1: కాకతీయ ప్రభువుల చేత నిర్మించబడిన కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయం నేటికీ భక్తులతో విరాజిల్లుతుంది. క్రీస్తు శకం 1143లో నాటి గోల్కొండ దుర్గాన్ని పాలించిన రెండో ప్రతాపరుద్రుడు మొదలుకొని ఔరంగజేబు వరకు కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామిని సేవించారని చరిత్ర చెబుతుంది ఆనాడు నిర్మించిన కోనేరు నేటి వరకు చెక్కుచెదరకుండా ఉంది. గోల్కొండ మహారాజు రెండవ ప్రతాపరుద్దుడు క్రీస్తు శకం 1143 లో తన సైన్యంతో ఇప్పుడు హైదరాబాద్ గా పిలవబడే నాటి చల్చికుం వేటకు బయలుదేరారు. వేటలో అలసిపోయిన ప్రతాపరులు అరణ్యప్రాంతమైన లక్ష్మీ గూడెం గ్రామ సమీపంలో ఉన్న ప్రస్తుత కర్మన్ ఘాటుకు విచ్చేసి బండరాయిపై విశ్రమించాడు అదే సమయంలో స్వయంభుగా వెలసిన ఆంజనేయ స్వామి దివ్య మంగళ విగ్రహం సాక్షాత్కరింది దీనితో రాజు 1143 లో హనుమాన్ జయంతి రోజున ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారు ఆలయ నిర్మాణం పూర్తి చేసి అర్చకులను నియమించి ఆలయానికి కొన్ని భూములు కేటాయించి రాజు తిరిగి వెళ్లిపోయారు. నాడు ఆయన నిర్మించిన ఆలయ ప్రాంగణంలోనే కాకతీయ రాజులందరూ తమకు ఇష్టదైవాలు అయినా శ్రీ గణపతి, జగన్నాథ స్వామి, సంతోషి మాత, కోదండ రామాలయం, నాగేశ్వర స్పటిక లింగేశ్వర నవగ్రహాలు, సరస్వతి దేవి, దుర్గామాత, విశ్వనాథ ఆలయం, వేణుగోపాల స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కృష్ణ మందిరం, కేదారి హనుమాన్ మందిరం తో పలు ఆలయాలు నిర్మించారు. జంట నగరాలలో ప్రసిద్ధిగాంచిన ఆలయం జంటనగరంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది పుష్కరణలు మధ్యలో ధ్యానాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు తో పాటు మంగళవారం శనివారం భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. మనసులో ఉన్న కోర్కెలను కోరి కొబ్బరికాయ ముడుపులు సమర్పించి స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. నూతన వాహన పూజలతో ఆలయం నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. కొలిచిన వారి కోరికలు తీర్చే ధ్యాన ఆంజనేయ స్వామి నిత్యం రామనామ స్మరణే శ్వాసగా జీవించే అంజనీపుత్రుడు హనుమంతుడు అలాంటి అంజేయుడు ధ్యానముద్రలో స్వయంభుగా వెలసిన పురాతన చారిత్రక ఆలయం ఎల్బీనగర్ నియోజకవర్గం సరూర్నగర్ మండలం చంపాపేట డివిజన్ కర్మన్ఘాట్ లో ఉంది. నేడు వీర హనుమాన్ విజయ యాత్ర హనుమద్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ భాగ్యనగర్ వివేకానంద జిల్లా ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ దేవస్థానం నుంచి చంపాపేట్, సంతోష్ నగర్, సైదాబాద్, కోఠి మీదుగా సికింద్రాబాద్ వరకు తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు విజయ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రను సాయి దాము పీఠాధిపతి స్వామి రామానంద ప్రభువు స్వామి జి ప్రారంభిస్తారు . ఈ యాత్రలో వేలాది ద్విచక్ర వాహనాలు బారులు తీరనున్నాయి. హనుమాన్ జయంతి వేడుకలు ఆలయంలో గురువారం నాడు నిర్వహించే అనుమతిజయంతి వేడుకల కోసం ఆలయాన్ని అందంగా విద్యుత్ దీపాలు రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు ఆలయంలో నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ ధ్యానంజేయ నీ స్వామికి ఉదయం 5 గంటలకు సింధూర అభిషేకం ఎనిమిది గంటలకు చండీ సహిత మన్యుసూక్త హోమం అర్చనలు ఆకు పూజలు సాయంత్రం 6 గంటలకు హనుమత్ రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ యూదుల కంటి సత్యనారాయణ రెడ్డి ఆలయ ఈవో ఎన్ లావణ్య తెలిపారు ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు తాగునీటి వసతి మజ్జిగ స్వామివారి ప్రసాదాలు అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె పేర్కొన్నారు.