Home Adyatmikam రేపటి నుంచి పంచరాగ్ని సమేత వరదరాజ పెరుమాళ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలుఫౌండర్ ట్రస్టీ చైర్మన్ పి...

రేపటి నుంచి పంచరాగ్ని సమేత వరదరాజ పెరుమాళ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలుఫౌండర్ ట్రస్టీ చైర్మన్ పి గోపాలకృష్ణ మాలతి

8
0

రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్. ఏప్రిల్ 25.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యన్త రహితుడు సృష్టి స్థితి లయకారుడు అపార కారుణ్య సౌశీల్య వాత్సల్యాది గుణ సంపన్నుడు సమస్త కళ్యాణ గుణకారకుడైన శ్రీ యఃపతి బ్రహ్మ ఆచరించిన యజ్ఞమునందు యజ్ఞపురుషుని రూపంలో వరదరాజస్వామి అవతరించాడని స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర 27వ తేదీ నుండి వరదరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ పి గోపాలకృష్ణ మాలతి ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమం వరదరాజపురం మర్కుక్ మండలం సిద్దిపేట జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈనెల 28 ఉదయం 27 సోమవారం విశ్వక్సేన ఆరాధన పుణ్యా వచనం ఉత్సవ ఆరంభం జరుగుతుందని 28వ తేదీన వైన తేయ ఇష్టి, (సంతాన ప్రాప్తికి ) 29వ తేదీన ధన్వంతి ఇష్టి ( సర్వవ్యాధి నివారణకు ఆరోగ్య అభివృద్ధికి ) 30వ తేదీన సుదర్శన నరసింహ ఇష్టి( సర్వ దోష నివారణకు ) ఒకటవ తేదీ మే భువరామ ఇష్టి( గృహ భూ సంబంధిత విషయాలకు) రెండవ తేదీ లక్ష్మీ హయగ్రీవ ఇష్టి( ఉత్తమ విద్యా ప్రాప్తికి ) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గోపాలకృష్ణ మాలతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు 1101/- చెల్లించి భగవత్ కృపకు పాత్రులు కాగలరని సంతాన ప్రాప్తికై గరుడ ముద్దా ప్రసాదము కావలసినవారు తలంటు పోసుకొని భోజనం చేయక రావాలని గరుడ ప్రసాదం ఈనెల 28వ తేదీన ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసీఐఎల్ బస్టాండ్ నుండి ఉదయం ఏడు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు తీగుల్ వరకు బస్సు సౌకర్యం ఉంటుందని సికింద్రాబాద్ నుండి గురుద్వారా హోటల్ ఎదురు బస్ స్టాండ్ నుండి ఉదయం 6 గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు వరదరాజపూర్ వరకు బస్సు సౌకర్యం ఉంటుందని బస్సు నెంబర్ 568 అని తెలిపారు.